Sunday, May 3, 2009

పాలు-నీళ్ళు

కొన్ని పదాలు ఎందుకు వాడుకలో ఉన్నాయో, అందరూ వాటిని ఎందుకు వాడతారో నాకస్సలు అర్ధం కాదు.ఉదాహరణకి ఒక జంట చూడటానికి బాగుంటే చిలకా గోరింకల్లా ఉన్నారంటారు.అలాగే ఆలుమగలు పాలు నీళ్ళల్లా కలిసిపోవాలని ఆశ్శీర్వదిస్తారు.

  మొదటి పోలిక ఎంత Ridiculous గా ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఒకవేళ దానికి Reasoning ఏమన్నా ఉంటే చెప్పండి.తెలుసుకుంటాను.

ఇక పాలు - నీళ్ళ గురించి.....

 పాలు,నీళ్ళ combination లో అంత గొప్పతనం ఏం ఉందో నాకు తెలియదు.పాలల్లో నీళ్ళు కలపటం వల్ల పాల నాణ్యత పాడవుతుంది. పైగా నీటికి అస్థిత్వం పోతుంది. విడిగా పాలు,నీళ్ళు వేటి ప్రాధాన్యత వాటికి ఉన్నా, ఒకసారి కలిసాక పాల Dominance ఎక్కువ.Hmm.. మన సమాజంలో కూడా పెళ్ళైతే స్త్రీ పరిస్థితి నీళ్ళలాంటిదని అన్యాపదేశంగా చెప్పడం ఆ పోలిక ఉద్దేశమేమో!!

 ఆలోచిస్తే, ఈ విషయంలో అన్నిటి కన్నా మంచి పోలిక "సంగీత సాహిత్యాలు" అనిపిస్తుంది.

సంగీతం సాహిత్యం లేకుండా బతకకలదు.

సాహిత్యం కూడా సంగీతం లేకుండా బతకకలదు.

కానీ ఆ రెండూ కలిసినపుడు వచ్చే ఆ combination-ఒట్టి సంగీతం,లేదా సాహిత్యం కంటే ఎన్నో రెట్లు బాగుంటుంది.

 what i am trying to say is - They compliment each other. or rather,they complete each other.

సంగీతం లేని సాహిత్యం,సాహిత్యం లేని సంగీతం ఏదో కోల్పోయినట్టుంటాయి( अधूरा).Atleast, నాకైతే అలానే అనిపిస్తుంది. ofcourse, ఇక్కడ నా దృష్టిలో సాహిత్యం అంటే వచనం కాదు,కవిత్వం....

అలాగని అవి ఒకదానిని ఒకటి Dominate చేసిన సందర్భాలు రావని కాదు.వచ్చినా కొన్నిసార్లు సంగీతానికి ప్రాధాన్యత దొరికితే,కొన్నిసార్లు సాహిత్యం పేరు తెచ్చుకుంటుంది.

మరి చెప్పండి.నిజంగా ఆలుమగలని దీవించాలంటే ,సంగీత సాహిత్యాల కన్నా మంచి పోలిక ఏమిటో!!!!

Thursday, January 29, 2009

పెళ్ళి-పెటాకులు

గత కొద్ది రోజులుగా స్త్రీ హక్కులు,స్త్రీ సమానత్వం గురించి చర్చలు వేడిగా జరుగుతున్నాయి.వీటి గురించి ఆలోచిస్తుంటే ఓ అంశం స్ఫురించింది.అసలు ఇప్పటి దాకా ఈ అవిడియా ఎందుకు రాలేదా అని నన్ను నేనే తిట్టుకున్నాను.గత 140 ఏళ్ళుగా వర్ధిల్లుతున్న ఆ కాన్సెప్టు  పేరు alimony.తెలుగు పదం తెలిసి చావదు."భరణం" అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
   మన పీనల్ కోడు ప్రకారం విడాకులు తీసుకున్న జంటల్లో మగవాడికి తగిలే బంపర్ సిక్కిం లాటరీ ఈ భరణం. అంటే తన మాజీ భార్య పోషణ అన్నమాట!అసలు తన మాజీ భార్య ని పోషించాల్సిన భాద్యత సదరు భర్తకెందుకుందో నా మట్టి బుర్రకు అర్ధం కాలేదు.అయినా ఏం సదుద్దేశం లేకుండా కోర్టు వారు ఎందుకీ రూలు పెడతారనుకున్నాను.అప్పుడు కూర్చుని అసలు ఈ భరణం తాలూకు వివరాలు నెట్లో వెతకడం మొదలెట్టాను. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

   ".... a woman is entitled to maintenance if her personal income is insufficient to maintain the standard of living she was accustomed to while living with her husband.' అని సుప్రీమ్ కోర్టు వారి ఉవాచ.

అంటే ముచ్చటపడి మీ శ్రీమతిని భోగభాగ్యాలలో ముంచి తేల్చారనుకోండి,విడాకులయిన తర్వాత రక్త కన్నీరే మీకు!

On a serious note,నిజంగా ఈ భరణం అనే కాన్సెప్టు...it doesn't make sense to me! 

 ఎందుకయ్యా ఇంత ఆక్రోశం అంటే... చట్టం చాలా లొసుగులిచ్చింది స్త్రీ కి ఈ విషయంలో...స్త్రీ తనని తాను పోషించుకునే స్థితి కి చేరుకునే వరకూ temporary alimony,ఒకవేళ ఆమె పోషించుకోలేదని కోర్టు భావించిన పక్షంలో permanent alimony సమర్పించుకోవాల్సి ఉంటుందిట.అసలు ఒక స్త్రీ ని పోషించాల్సిన భాధ్యత పురుషుడిదేనా?తన కాళ్ళమీద 
నిలబడవలసిన responsibility ఆమె కు లేదా?? Why the hell should i care  if she is incapable of feeding herself??

 ఆశ్చర్యమేమిటంటే విదేశాల చట్టాల్లో ఈ alimony విషయంలో spouse అన్న మాట ఉపయోగించడం జరిగింది. అంటే, సందర్భాన్ని బట్టి భర్తయినా,భార్యయినా భరణానికి అర్ఘులే అన్నమాట!
భర్త సంపాదన నామమాత్రంగా ఉండి భార్య ఎక్కువ సంపాదిస్తుంటే భార్యే భరణం చెల్లించవలసి ఉంటుందన్నమాట.కానీ మన పీనల్ కోడ్ లో మాత్రం 'Husband pays wife' అన్న అర్ధం మాత్రమే ఉంది.
agreed.1869 నాటికి పరిస్థితులు వేరు.ఒక అమెండ్మెంటు చెయ్యచ్చు కదా!


 కట్నం మీద నాకెప్పుడూ సదభిప్రాయం లేదు.వివాహమనేది ఒక స్త్రీ పురుషులిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం,ఇద్దరి జీవితాలు significant changes కి గురి అవుతాయి.ఒకరి వద్ద ఇంకొకరు డబ్బు తీసుకోవడం greed తప్ప మరేమీ కాదనుకునేవాడిని.కానీ ఇప్పుడాలోచిస్తుంటే కట్నం తీసుకోవడం....it makes sense.కాకపోతే దాన్ని నేను caution deposit గా పిలుస్తాను.
రేపు మేము విడాకులు తీసుకుంటే నాకున్న విశాల భావాలే కోర్టుకుండవు కదా!నా భార్యకు భరణం ఇవ్వాల్సిందేనంటుంది,తను ఉద్యోగం చేస్తున్నా కూడా!అప్పుడు ఈ caution deposit ఉపయోగపడుతుంది నాకు.కాదూ,కూడదూ అనుకుంటే పెళ్ళికి ముందే ఒక లీగల్ అగ్రిమెంటు మీద సంతకం చేయించుకోవాలి,విడాకులయిన పక్షంలో నాకు భరణం అక్కర్లేద్దూ... అని. ఎందుకంటే,as i see it,women can't have their cake and eat it too...

నా ఈ ఆలోచనలు చాలా క్రూడ్ గా ఉండవచ్చు.ఇవి ఇంకా ఇప్పుడే వచ్చాయి నా మెదడులోకి.i've to think over them to come to an opinion. అందుకే ఈ పోస్టు.
నా వాదనలో లోపం కనబడితే ఏమిటో చెప్పండి.స్త్రీకి భరణం ఇవ్వాలని మీరనుకుంటే మీ point of view చెప్పండి.కానీ దయచేసి "వివాహం ఒక పవిత్రమైన వ్యవస్థ.మన సంస్కృతిలో స్త్రీకి మహోన్నత స్థానం ఉంది" ఇలాంటి సలహాలు వద్దు.

SHOOT!

Friday, December 19, 2008

SANDEEPHISM

My favourite passtime involves me fantasizing about stuff i think i would like to do but in real life too timid to actually do it. To day is your lucky day! you are going to get a chance to peek into my fantasy world for a while.

    Today i saw a lady in my office wearing a burkha  on the top of her dress. Call it creepy coincidence, but today i also saw a sikh guy sporting a huge beard and a guy wearing overall blacks as he is in "ayyappa diksha".

   This is disturbing on many levels. 

Apparantly,not shaving ur beard is bad for the company and moral of the employees,but okay if your religion doesn't allow it. Similarly,wearing formal clothes is neccessary for professional environment,
but not if ur religion forbids it. Apparantly if our clients see this bearded guys and burkha women they will understand that they are simply following their religion. so no loss for company.

This is exactly the  kind of situation where my wicked mind will go gaga over various possibilities.

So i digged up some HR policy list in our company website and bingo! I found that Our company will give "Reasonable" exceptions to people regarding their dress code based on their religions.

There are two loose terms here. one is "reasonable" and another is, of course : "Religion" . I can to use them to my advantage. So i fantasized about talking my HR into giving me permsion to wear normal clothes and chappals to office. It will probably go like this:

Me: So, i understand that Our company is willing  to make reasonable exceptions to accomdate my religious beliefs.

HR : Yes, we do.

Me: kool. Because my religion doesn't allow me to wear shoes. god will make me rot in hell if i hide my feet from fellow human beings.

HR: (probably confused): I never heard of that before.  What religion is that??

Me: (casually): Oh, i don't have a name for it. but i am thinking along the lines of sandeephism.
do u like it??

HR: Are you saying that u founded ur own religion??

Me: yup,I don't see why i should follow other religions  which are thousands of year old and obviously outdated. My religion is kooler and trendier.

HR: (shocked)


Me: Of course, for now, its a lonely religion, but i am hoping to convince my parents and my brother to join it.


HR: Um, i am afraid we don't recognize...

Me: (angrily) What? Are you insulting my religion? Are you insulting my god's ways?? I am gonna complain to the regional HR head that you are showing discrimination against my religion..

HR: (aghast): But That rule in ur religion is wierd...

Me: Hey, if sikhs can believe that they are not supposed to display their hair, why can't i believe that i am not supposed to NOT display my feet?? Thats it. I am escalating it to....

HR: okay, okay, U may wear chappals to work.

Me: Good, now according to my religion, I am only supposed to wear round neck T shirts with funny captions.... 





    I hope you got the hang of what i was hoping to achieve here. But alas, I am too timid to actually go and talk to my HR, So i fantasize and write blog entries about it. But hey, thats cool too....


QUESTION: Assuming i convinced ur HR that followers of my religion need not wear shoes and ties and formals, will you convert to sandeephism and proclaim me as ur prophet??
 

Thursday, September 11, 2008

కులవరమాయే మదిలో... నా మదిలో....

నేను నా కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న కులం నాది. నా కులం ప్రపంచానికి ఎందరో మహనీయులని అందించింది. వారు నా కులం వారని తలుచుకున్నపుడు నా చాతీ
గర్వంతో ఉప్పొంగుతుంది. మిగతా కులాలు ఇంకా సరిగ్గా అభివృద్ధి కూడా చెందని రోజుల్లోనే, నా కులం నాగరికత నేర్చింది. ఇంకా చెప్పాలంటే, నా కులమే ఇతర కులాలకు నాగరికత నేర్పిందన్నా అబద్దం లేదు.
ఫలానా కనుగొన్న ఫలానా నా కులం వాడే...

నా కులం ఎప్పుడూ ఇతర కులాలతో సామరస్యంగానే ఉంది. ఇతర కులాల వాళ్ళు రాళ్ళు రువ్వినా,రెచ్చగొట్టినా సంయమనం కోల్పోలేదు.అదీ నా కులం గొప్పదనం.

నా కులం అభివృద్ధి కి నేను పాటు పడతాను. నా కులం వాడు,ఇంకో కులం వాడితో ఏదైనా విషయంలో పోటీ పడుతుంటే నా కులం వాడే నెగ్గాలని మనస్పూర్తిగా ఆశిస్తాను.నా కులానికి చెందిన స్నేహితుడు,ఇంకో కులానికి చెందిన స్నేహితుడూ నా సాయం కోరి, ఇద్దరిలో ఒక్కరికే సాయం చెయ్యగల పరిస్థితిలో ఉంటే నేను నా కులం వాడికే సాయం చేస్తాను.ఇది చెప్పటానికి నేనేమీ సిగ్గు పడటం లేదు.అది నా బాధ్యత అని భావిస్తాను. అన్ని కులాల వాళ్ళమూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నా కులం వాడు ఇంకోడు కనిపిస్తే నాకు ఆత్మీయుడిని చూసినట్టు ఉంటుంది తెలుసా!

నా కులం వాడు ఏదైనా రంగంలో గుర్తింపు సాధిస్తే నేనే ఆ విజయం సాధించినట్టు ఫీలవుతాను. నా కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళతో గొడవ పడితే నా కులం వాళ్ళే గెలవాలని కోరుకుంటాను.నా కులం బాగులోనే
నా బాగు ఉందని నమ్ముతాను.

ఈ మధ్య ఈ కులంలో పుట్టిన ప్రతీ ఒక్కరికీ ఈ కులాన్ని తిట్టుకుంటూ, ఈ కులం ఆచారాల్లో లోపాలు ఎత్తి చూపటం,ఆర్ధికంగా పై మెట్టు మీదున్న మిగతా కులాలని పొగడటం ఫ్యాషనైపోయింది.
అలాంటి వారిని చూస్తే నాకసహ్యం. నా కులం ఆర్ధికంగా ఆ కులాలంత అభివృధ్ది పధంలో లేకపోవచ్చు. కానీ ఇతర కులాలన్నీ ఈర్షపడే సాంస్కృతిక వారసత్వం నా కులానికే సొంతం. ఈ విషయంలో ఇంకే కులం
నా కులానికి సాటి రాదని ఘంటాపదం గా చెపుతున్నాను....
****************************************************************









చదవడానికే అదోలా ఉంది కదా! ఇది రాసిన వాడు ఎంత కులపిచ్చోడై ఉంటాడో అనిపిస్తోందా? గుడ్. ఇప్పుడు పై పేరాల్లో "కులం" అన్న పదం స్థానంలో "దేశం" అన్న పదం పెట్టి మళ్ళీ చదవండి.











మాకర్ధమైపోయింది లేవోయ్.. అని ఊరుకోకండి. ప్లీజ్. ముందు చదివి ఆ తర్వాత ఇక్కడికి రండి.

ఏదో పత్రికలో పడిన దేశ భక్తి వ్యాసంలా లేదూ... ఒక సగటు మనిషి ఆలోచనలు కావూ?

************************

నా కాలేజీలో కులాల గొడవ గురించి నేను టపా రాసినప్పుడు విహారి గారిచ్చిన కామెంటిది.
ఆ కామెంటు తో నాలో అంతర్మధనం మొదలయ్యింది.అక్కడే నా సందేహం వెలిబుచ్చినా నా బాధ ఇంకొంచెం వివరంగా చర్చించాలనిపించింది.

దేశం,కులం రెండూ చాలా similar. రెండూ మన పుట్టుకతోనే నిర్ణయమైపోతాయి.మన concious choice కాదు.(nationality మార్చుకోవచ్చనుకోండి. కానీ అది negligible.
more over, పౌరసత్వం మారినంత మాత్రాన దేశభక్తి పోతుందని నేను అనుకోను.) చిన్నప్పటి నుండి చూట్టూ ఉన్న వారి ప్రోద్బలం వల్ల మనలో కలిగే భావాలే రెండూ.
మరి ఒకటి తప్పెలా ఐంది, ఇంకోటి ఒప్పెలా ఐంది??

దేశ "భక్తి" ఎలా ఆయింది? కుల "పిచ్చి" ఎలా అయింది??

"మీదే దేశం?" అని అడగటం సభ్యతెలా అయింది?
"మీదే కులం?" అని అడగటం అసభ్యతెలా అయింది?


కులాభిమానంలో ఏమీ తప్పు లేదని నేను నా కులాన్ని embrace చేసుకోవాలా?? లేక అది తప్పైనప్పుడు దేశమంటూ అభిమానం చూపించటం కూడా తప్పని "జగమంత కుటుంబం నాది" అనుకోవాలా?


మీరే సలహా చెప్పండి!

Sunday, July 13, 2008

టిప్పు సుల్తానులు

మొన్నీ మధ్య స్నేహితులతో కలసి హోటలుకి వెళ్ళాను.ఫుడ్దు మీద దండయాత్ర జరిపాక బిల్లు చేతికి వచ్చింది.అదేంటో లక్కీగా కరెక్టు ఎమౌంటు
నా దగ్గర ఉంది. సర్లే కదా అని అక్కడ పెట్టేసి బయటకి నడిచాను.మా ప్రెండ్సు కేసి చూద్దును కదా... నేనేదో అడుక్కుంటున్న బిచ్చగాడి జోలెలోంచి
చిల్లర కొట్టేసినట్టు నా కేసి చూస్తున్నారు.
"ఏమైందిరా.." అని అడిగాను.
"అదేంట్రా... టిప్పివకుండా వచ్చేసావు?" అని అడిగాడు ఒకడు.
"కరెక్టు మనీ ఉంది కదా అని..."

"అక్కడ ఆ వెయిటరు మన కేసి ఎంత అసహ్యంగా చూసాడో తెలుసా..?" ఇంకొకడు అందుకున్నాడు.

నాకు విషయం అర్ధమైంది.

"అంటే వాడు తిట్టుకుంటాడేమో అని మనం టిప్పు ఇవ్వాలా..?"

"అలా కాదురా..మనకి బాగా సెర్వ్ చేసాడు కదా..!" ఇంకోడు చెప్పబోయాడు.

"అది వాడి ఉద్యోగం కదా..."

"జనరల్ గా అందరూ ఇస్తాం కదరా...?"

"అదే.. ఎందుకిస్తామో చెప్పు?"

ఇంకోడి కి మండింది."ఎహే.తొక్కలో పది రూపాయిలు టిప్పు గురించి ఇంత వాదిస్తావేంటెహె పీనాసోడిలాగా..?"

"ఇక్కడ మేటరు మనీ కాదురా... అసలు ఎందుకిస్తామో రీజను"
"బాబూ నక్సలైటూ! మళ్ళీ నీ ఆదర్శాలు మొదలెట్టకు. పద పోదాం" అంటూ ఇంకోడు కట్ చేసాడు. అక్కడితో ఆ ప్రహసనం ముగిసింది.

అదిగో.. అక్కడ చెప్పాలనుకున్న మాటలే ఇక్కడ బ్లాగుతున్నాను...

ప్రపంచంలో ఏ ఉద్యోగంలోనైనా మనం చేసే పనికి మన యజమాని మనకి జీతం ఇస్తాడు. మన పని బాగుంటే బోనస్సులూ,ఇంక్రిమెంటులూ అన్నీ యజమానే
చూసుకుంటాడు.అలా కాక మన పని మనం చెయ్యడానికి కస్టమరు నుండి డబ్బు డిమాండు చేస్తే అది లంచం అవుతుంది. at least, నాకు తెలిసి లంచం definition అదే...
మరి వెయిటర్లకి మాత్రం ఈ రూలు ఎందుకు మినహాయింపో నాకు అర్ధం కాదు.మనకి సెర్వ్ చెయ్యడం అతని ఉద్యోగం.అదే చేసాడు. నేను బిల్లు కడతాను.
మరి అదనంగా అతడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి??

but, thats not the worst part...అలా సరైన మొత్తంలో టిప్పు ఇవ్వని వాళ్ళందరూ పిసినారులని ఎందుకు అనుకోవాలి?
టిప్పు ఇవ్వకుండా వచ్చిన ప్రతీ సారీ ఆ హోటల్లోంచి స్పూనులు,ఫోర్కులు ఎత్తుకొచ్చినట్టు ఎందుకు గిల్టీ ఫీలవ్వాలి?
why this habit is so widely accepted around the world that whomever
don't follow it are labelled as queers?

మీలో ఇప్పటికే ఏంటిరా వీడి గోల ఇంత చిన్న విషయానికి అనుకుంటూ ఉండవచ్చు.కానీ సీరియస్ గా నాకు అర్ధం కాని విషయమిది.మీరు ఎప్పుడు హొటలుకి
వెళ్ళినా టిప్పు ఇస్తూనే ఉంటారు. అసలు ఎందుకు ఇస్తున్నారో ఆలోచించారా?
నాకు తట్టిన కారణాలివి...

1.అందరూ ఇస్తున్నారు కనుక.
2.చిన్నప్పటి నుండి అలవాటవడం వలన.
3.ఇవ్వక పోతే అంతా పిసినారి అనుకుంటారన్న భయం వల్ల .
4.వెయిటరు సర్వీసుతో satisfy అవ్వడం వలన.

కానీ ఎంత ఆలోచించినా అన్ని కారణాలకూ మూల కారణం మనం చిన్నప్పటి నుండి పెరిగిన కండిషనింగ్ వల్లనేమో అనిపిస్తుంది.కానీ అసలు ఈ అలవాటు ఎక్కడ ఎలా మొదలయింది అన్నది నాకు అంతు చిక్కని ప్రశ్న.

Believe me,టిప్పు ఇవ్వడం పెద్ద సమస్య అని నేను అనటం లేదు.కానీ tipping is no longer a gesture
of generosity now. its compulsory!టిప్పు ఇవ్వకపోవడం పెద్ద social stigma అయిపోయింది.
అదే ఎందుకు అని అడుగుతున్నాను.

ఇది ’చిల్లర’ సమస్య గా మీకనిపించవచ్చు . కానీ దీని వెనకాల ఉన్న లాజిక్కు ఆలోచించీ చించీ నాకు బుర్ర పిచ్చెక్కుతోంది.

మీలో ఎవరైనా దీనికి సంతృప్తికరమైన సమాధానం చెప్పగలరా?

Sunday, July 6, 2008

బెదిరేటి డ్రెస్సు నేనేస్తే...

నిన్న జానే తూ యా జానే నా... సినిమాకి వెళ్ళాను.విచిత్రంగా హీరో పేరు వచ్చినప్పుడు కామ్ గా ఉన్న జనం హీరోయిన్ జెనీలియా పేరు రాగానే ఈలలు వేసారు. ఆహా, జన్మ ధన్యమయింది కదా అనుకున్నాను.
నాది కాదు, జెనీలియాది.లేకపోతే ఈ దేశంలో హీరోయిన్ పేరుకి విజిల్సు పడటమూ,హిరోకి పడకపోవడమూనా! పైగా జెనీలియా తమిళంలో పెద్దగా పాపులర్ కూడా కాదు. (ఒక్క సంతోష్ సుబ్రమణియం తప్పిస్తే..). మరి ఆంధ్రా లో రియాక్షన్ ఎలా ఉందో నాకు తెలియదు.

ఇంతకీ నేను చెప్పదల్చుకున్న విషయం అది కాదు.

మీరు చెన్నైలో ఉంటున్నారా? సైటు కొడదామంటే ఒక్క అమ్మాయీ బాలేదని బాధతో కృంగి కృశిస్తున్నారా?? ఐతే మీకు ఒక కిటుకు చెపుతా చదవండి.చెన్నైలో అందమైన అమ్మాయిలకు కొదవ లేదు.కాకపోతే
వారు ఎక్కడ పడితే అక్కడ కనిపించరు.ఫర్ ఎగ్సాంపిల్,టైడల్ పార్కులో గనుక మీరు పని చేస్తుంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టినట్టే!వెతికి వెతికి మీ కళ్ళు అలసిపోవడమే తప్ప లాభం ఉండదు. అదే అక్కడికి
రెండొందల అడుగుల దూరంలో ఉన్న అసెండాస్ ఐటి పార్కు కి వెళ్ళారా... జాతరే! ఇంకా ఎక్కువ రాస్తే జనాలు సామూహిక హత్యాయత్నం చేసే ప్రమాదం ఉంది గనుక ఇంక చెప్పను. ఇలాంటి
సలహాలు కావాల్సిన వారు మెయిల్ ద్వారా సంప్రదించండి.

నేను చెప్పొచ్చేదేంటంటే అల్లాంటి ప్రదేశాలే హిందీ సినిమాలు ఆడే హాళ్ళు. మల్టిప్లెక్సా,మామూలు హాలా అని సంబంధం లేదు. నగరంలోని creme de la creme అంతా అక్కడ కనిపిస్తారు మీకు.
కానీ నేను చెప్పదల్చుకున్నది దీని గురించి కూడా కాదు.



నిన్న ధియేటర్ ముందు నిలబడి వచ్చే పోయే జనాలని చూస్తుండగా నాకో వింత అవిడియా వచ్చింది.అప్పటి నుండి అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి డ్రెస్సింగ్ గమనించటం మొదలెట్టాను.
రామ రామ!
మీరనుకునేంత యదవని కాదండీ బాబూ...! నా బాధ వేరే ఉంది. దాని కోసమే ఈ టపా!

నేను ఒక walking talking fashion faux pas ని.అనగా ఏ సమయంలో ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలియని, అసలు ఏ డ్రెస్సులు బావుంటాయో, ఏవి బావుండవో డిసైడ్ చేస్కోలేని
మొద్దునన్నమాట.( మనలో మన మాట. మనం అమ్మాయిల విషయంలో జర వీకుగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం!).

కారణం ఏమిటో తెలియదు గానీ నాకు షాపింగంటే మహా చిరాకు.ఆ విషయంలో నా maximum endurance limit రఫ్ గా ఓ 15 నిముషాలుంటుందంతే.పదహారవ నిమిషం నుండి
విసుగు స్టార్ట్ అవుతుంది.ఇరవై రెండవ నిముషానికి అది చికాకుగా మారుతుంది. ఇరవై తొమ్మిదో నిముషానికి అది కోపంగా పరిణమిస్తుంది. ముప్పై ఐదో నిమిషం దాటిందా...ఇక నాకు ఊపిరాడదు.
నేను అగ్గి రాముణ్ణే అన్న మాట.ఆ సమయానికి కళ్ళ ముందు ఏ డ్రెస్ కనబడితే అది సెలెక్టు చేసుకుని బయటకు వచ్చేసి ఊపిరి పీల్చుకుంటాను. అందుకే, గంటలు గంటలు విసుగు, అలుపూ లేకుండా
అలా షాపులన్నీ తిరిగే జనాలని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా చెన్నైలో టి నగర్ కి వెళ్లామా,జనాలు రాత్రి పూట అక్కడే దుప్పట్లు పరుచుకుని పడుకుంటారు. పొద్దున్న షాపులు ఓపెన్ చెయ్యడం ఆలస్యం లోపలికి పరిగెడతారు.
అందుకేనేమో, చాలా షాపులలో రెస్టారెంట్లు కూడా తెరిచారు. ఇహ ఉదయాన్నే వెళ్ళడం, తిరగడం, అక్కడే ఏదో ఒకటి తినడం, మళ్ళీ షాపింగ్. నాలాంటి వాళ్ళ కోసం ఆక్సిజన్ బార్లు కూడా తెరిస్తే
బావుణ్ణు!

ఇంతకీ ఈ షాపింగ్ పోబియా వల్ల జన్మలో ఒక మంచి బట్ట కట్టి ఎరుగను.ఖర్మ కాలి ఆ అరగంట లోపలనే ఏదైనా డ్రెస్సు నచ్చినా ఇంటికొచ్చి వేసుకునే సరికి అదే డ్రెస్సు ఇంకో రకంగా అనిపిస్తుంది.
అదేంటో విచిత్రం,మా అన్న గాడు వేసుకున్న డ్రెస్సులు చాలా బావున్నాయని కబ్జా చేసి లాక్కుంటే నా ఒంటి మీదకి రాగానే వాటి అందం కాకెత్తుకుపోయినట్టు మాయమైపోతుంది.ఒక్కొక్క సారి ఇదేమైనా పూర్వజన్మ
పాపమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు.

ఈ మద్యే ఈ దుస్థితికి చరమ గీతం పాడాలని సంకల్పించాను.నా ward robe ని పూర్తిగా మార్చెయ్య తలచి నా బ్యాంకు బాలెన్సుని ఓ సారి తనివి తీరా చూసుకుని, ఆ స్క్రీన్ షాటుని సేవ్
చేసుకుని, కడసారి కన్నీటి వీడ్కోలు పలికి లాగవుట్ చేసాను.దెబ్బకి సినిమా హీరోలా తయారవ్వాలి అనుకుని షాపులోకి అడుగు పెట్టాను.కానీ నన్ను నా శాపం వదల్లేదు.
అదేంటో షర్టులన్ని white,blue,cream.ఫాంటులన్నీ black,brown,cream,blue.నా కళ్ళకి మిగతా రంగులని గుర్తించే పవర్ లేదు. ఎన్ని పెర్ముటేషన్లు వేసినా కుదరడం లేదే...
అసలు బయట kool dudes గా బావించబడే వాళ్ళు ఏం వేసుకుంటున్నారా అని సందేహం వచ్చింది. అసలు ముందు ఇదంతా బాగా పరిశీలిస్తే మంచిదని తీర్మానించాను.
అదిగో సరిగా అందుకే సినిమా హాలు బయట నా బీటింగు.

ఒక ఐదు నిమిషాలు గమనించానో లేదో నాకో ఘోర సత్యం తెలిసింది.దానికంటే ముందు నా పరిశీలన/పరిశోధన తాలూకు వివరాలివీ....

నాకు తెలిసిన అమ్మాయిల డ్రెస్స్లులు రెండే.చీర,చూడీదార్. మా కాకినాడలో అంతే. అదేంటో అక్కడ ఈ కేటగిరి లోకి వచ్చే అమ్మాయి ఒక్కరూ లేరు. అసలు ఆ డ్రెస్సులని ఏమంటారో కూడా నాకు తెలీదు.
అసలు నేనెప్పుడూ చూడలేదు.కాని విచిత్రమేమిటంటే, ఒక అమ్మాయి వేసిన టైపు డ్రెస్సు ఇంకో అమ్మాయి వెయ్యలేదు.అన్ని రకాలున్నాయి అక్కడ.

మరో వైపు అబ్బాయిలు.( న్యాయంగా ఐతే నా పరిశీలన కి అబ్బాయిలని పరిశీలిస్తే సరిపోతుంది. కానీ పక్షపాతం చూపించటం ఇష్టం లేక అమ్మాయిలని కూడా చూడాల్సి వచ్చింది.).
నేను చూసిన ప్రతీ వాడూ దాదాపుగా యూనిఫామ్ లో ఉన్నట్టున్నారు.ముప్పాతిక శాతం బ్లూ జీన్సు.పాతిక శాతం క్రీమ్ కలర్ కార్గో ఫేంటు.ఐతే షర్టు.లేకపోతే టీ షర్టు.అంతా కలిపి మూడు కలర్లున్నాయి అక్కడ.
red,blue,black.

అయినా విచిత్రం గా వాళ్ళకి ఆ డ్రెస్సులు బానే ఉన్నాయి.yet i am sure, the moment i wear them, i will look like a complete idiot!

సరే నా బాధలు తీరేవి కాదు వదిలెయ్యండి.కానీ ఏమిటీ అన్యాయం.ఎందుకీ ఘోరం.అమ్మాయిలకి అన్ని రకాల choices ఉన్నాయి. hell, ఆఖరికి వేసుకునే చెప్పుల విషయంలో కూడా
ఈ తేడా ప్రస్పుటంగా కనబడుతుంది. ఇది సరిపోదన్నట్టు అమ్మాయిలకి నగలు,మేకప్పులు ఇంకా బోలెడన్ని accessories. పట్టుకునే పర్సు కూడా అతివలకి అలంకారమే.మరి మగాళ్ళకో,
అది కామ్ గా ఓ మూల నక్కి ఉంటుంది.

ఇన్ని అలంకారాల మద్య నా బోటి వాడు అందరికీ ఏబ్రాసిలా కనబడక చస్తాడా? అందుకే అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ ఏం చేస్తానో అదే చేసాను.ఎవ్వరికీ కనబడకుండా ఓ మూల దాక్కున్నట్టు నిలబడి సినిమా
స్టార్ట్ అయ్యి లైట్లు ఆర్పేదాకా వెయిట్ చేసాను. వాడు ఒక్క సారి లైట్లు ఆర్పగానే ధైర్యంగా లోపలకి అడుగు పెట్టాను.సినిమా క్రెడిట్స్ ఇంకా అవుతుండగానే లోపల బాంబు ఉన్నట్టు పరిగెత్తుకు వచ్చేసాను.

చివరాఖరికి నే చెప్పొచ్చేదేమిటంటే, fashion is not my cup of Tea!

Tuesday, June 24, 2008

స్వప్నాంజలి

ఎవరెస్టు మీద నిలబడి సూర్యోదయాన్ని చూస్తున్నాను. కానీ నా మనసు ఆ సుందర దృశ్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేదు. అసహనంతో కాసేపు అటూ ఇటూ పచార్లు చేసాను. ఇంకా అంజలి రాలేదేంటి?? చిరాకనిపించి తాగుతున్న టీ కప్పుని పక్కనున్న డ్త్రైనేజీలోకి విసిరేసాను. వెనకాల కిలకిలా నవ్వు వినిపించింది. తిరిగి చూద్దును కదా! అంజలి!!
మొహంలోని ఆనందాన్ని దాచుకుని బుంగమూతి పెట్టుకున్నాను.
"ఏంటో, అబ్బాయిగారికంత కోపం??"
"నాకా! నాకెందుకూ కోపం?? నువ్వేమన్నా ఆలస్యంగా వచ్చావు గనుకనా నాకు కోపం రావడానికి..." ఉక్రోషంగా అన్నాన్నేను.
తను మళ్ళీ నవ్వింది. తను అలా నవ్వుతుంటే నా కోపాన్ని కట్టిబెట్టి నాకూ నవ్వాలనిపించింది. కానీ బలవంతాన మళ్ళీ కోపం తెచ్చుకున్నాను.
"కామన్ గా అబ్బాయిలు లేటుగా వచ్చారని అమ్మాయిలు కదా అలిగేది!" అంది తను నన్ను ఏడిపిస్తునట్టు.
"అంటే... అలిగే హక్కు అమ్మాయిలకే ఉందా!" రెట్టించాను నేను.
తను నవ్వి నా పక్కన కూర్చుంది. గోముగా "సారీ! ఇంకెప్పుడూ లేటుగా రాను. సరేనా..." అంది.
ఆ చిన్నమాటకే నేను ఐసైపోయాను. ఐనా చివరి ప్రయత్నంగా "నువ్వెప్పుడూ ఇలాగే అంటావు" అన్నాను.
అంజలి సమాధానం చెప్పలేదు. నా కళ్ళల్లోకి చూసి నవ్వింది. నేనూ నవ్వేసాను.
"ఇన్నాళ్ళూ ఏమైపోయావు?" తను అడిగింది.
"ఊరికే అలా షికారెళ్ళాను" నేను సమాధానమిచ్చాను.
"ఎక్కడికి"
నేను సమాధానం చెప్పలేదు. లేచి నిలబడి ఆకాశంలోని అల్మారా తలుపు తెరిచాను. ఒక పెట్టె తీసి ఆమె ముందు ఉంచాను.
"ఏంటిది" ఆమె ఉత్సాహంగా అడిగింది.
"తెరిచి చూడు"
తెరుస్తూనే ఆమె కళ్ళు విప్పారాయి. అందులో రెండు వందలకు పైగా అరలు. ప్రతి అరలోనూ మట్టి. అర బయట ఒక లేబిల్.
నేను నవ్వుతూ "లాస్ట్ టైమ్ మనం కలిసినపుడు ఏమన్నావో గుర్తుందా?" అన్నాను.
తను ఇంకా ఆశ్యర్యం నుండి కోలుకోలేదు.
"ప్రపంచంలోని అన్ని దేశాల soil ని సెకరించాలన్నది నీ చిన్నప్పటి కోరికని..."
"అందుకని..." నా మాటలని మధ్యలోనే కట్ చేసింది."దేశాలన్నీ తిరుగుతూ మట్టి ఏరుకుంటూ కూర్చున్నావా ఇన్నాళ్ళూ!"
ఒక్కక్షణం హర్టయ్యాను.
"నీకు నచ్చలేదా..."
తను చప్పున నా నెత్తిన మొట్టింది."మొద్దూ! ఇంత అభిమానంతో నాకోసం తెచ్చిన బహుమతి నచ్చకపోవడమా!"
ఆమె కళ్ళల్లో తడి నా దృష్టి ని దాటి పోలేదు.
"ఐనా నేను నీ కోసం తిరగలేదులే..." అన్నాను.
"మరి..."
"ప్రతీ కంట్రీలోనూ ఒక్కో గర్ల్ ఫ్రెండుని మెయిన్టైన్ చేస్తున్నాలే! అందర్నీ పలకరిద్దామని వెళ్ళి... పనిలో పనిగా...."
తను ఫక్కున నవ్వింది. "అబ్బో. మనకంత సీను కుడానూ!"
తన నవ్వులో నేనూ జత కలిపాను.
చుట్టూ ఉన్న ఆకాశం కరిగిపోయింది.
**********************************

కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఇసక! సహారా ఎడారిలో ఇద్దరమూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తున్నాము. "ఇక్కడకు తీసుకొచ్చావెందుకు?" అన్నాను. తనేం మాట్లాడలేదు.
తన వంక చూసాను. గులాబీ రంగు టాప్, వైట్ స్కర్ట్ లో దేవకన్యలా ఉంది.
"ఈ రోజు చాలా బావున్నావు" అన్నాను.
ఐనా తనేమీ మాట్లాడలేదు.ఎందుకో ముభావంగా ఉంది ఈ రోజు కలిసినప్పటి నుంచి.
అప్పుడు గమనించాను తన చెంపల చివర కన్నీటి చారికలని! నా గుండె ఆగినంత పనైంది.
తన భుజం మీద చెయ్యి వేసి "ఏమైందిరా అంజలీ!" అని అడిగాను.
తను నా భుజం మీద తల వాల్చి కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. నేను ఓదార్చే ప్రయత్నమేమీ చెయ్యలేదు.
ఆమె అలా కాస్సేపు తనివి తీరా ఏడ్చింది. ఆ తర్వాత ఆమే " పరీక్ష ఫెయిలయ్యాను రా!" అంది.
ఏం జరిగిందోనని కంగారు పడుతున్న నాకు ఆమె బేల గా ఈ విషయం చెప్పిన తీరుకు నవ్వొచ్చింది. కానీ సంభాళించుకున్నాను. తను అలా మాట్లాడుతుంటే వింటూ కూర్చున్నాను.
కాస్సేపటికి తను కాస్త తెప్పరిల్లింది. కానీ ఇంకా మొహంలో ఆ బాధ కనిపిస్తూనే ఉంది.
"ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదురా!" అంది బేలగా. వాళ్ళ నాన్నంటే అంజలికి చాలా భయం.
"పర్వాలేదురా" నేనన్నాను. "పేరెంట్స్ పైకి కఠినంగా కనిపించినా వాళ్ళకి మాత్రం నీ మీద ప్రేమ ఉండదా చెప్పు?
నువ్వు ఇలా ఏడుస్తున్నావని తెలిస్తే వాళ్ళెంత బాధ పడతారో తెలుసా?? ధైర్యంగా వెళ్ళి ఇంట్లో ఈ విషయం చెప్పు. ఈ సారి ఖచ్చితంగా పాసవుతానని హామీ ఇవ్వు నువ్వు definite గా పాసవుతావు. సరేనా!" అని బుజ్జగించాను.
ఆమె తలూపింది. మా చుట్టూ ఉన్న ఎడారి పూల తోట గా మారింది.
చాలా అమాయకంగా నా భుజం మీద తల ఆన్చి "నువ్వు లేకుండా ఎలా బతకగలనురా?" అని అడిగింది.
ఆ క్షణం నాలో చెలరేగిన భావాలని ఎలా చెప్పను??
తనతో " నీ సంగతి తెలీదు. నేను మాత్రం నువ్వు లేకుండా బతకలేను. I LOVE YOU" అని చెప్పాలనిపించింది.
ఊహూ. ఇది సమయం కాదు. చెపుతాను. తనని మళ్ళీ సారి కలిసినపుడు చెపుతాను. ...
************************************
మేమున్న తోటలోని ప్రతీ పువ్వు వాడిపోయి ఉంది. నా అంజలి వదనం కూడా! ఆ రోజు తర్వాత 8 నెలల దాకా అంజలి నాకు కనబడలేదు.ఇదిగో, మళ్ళీ ఇప్పుడు.!
"ఇన్ని నెలలూ ఏమైపోయావు అంజలీ" గొంతు పెగల్చుకొని అడిగాను.
తను చాలాసేపు మౌనంగా ఉంది. ఆ తరువాత అంది.
"రేపు నా పెళ్ళి"
విచిత్రంగా నేను షాక్ తినలేదు. ఎందుకో నాకు ఇది ముందే తెలిసినట్టనిపించింది.
"అంజలీ... నేను.. నిన్ను... i l.."
"నాకు తెలుసు." తను నా మాటలని మధ్యలోనే ఆపేసింది. తరువాత నెమ్మదిగా అంది.
"మన ఆఖరి కలయిక తరువాత నేను ప్రేమలో పడ్డాను"
నా మెదడు మొద్దు బారి పోయినట్టైంది. నా అంజలి... ఇంకొకరి ప్రేమలో... ఎలా?? ఎందుకు??
తను బుజ్జగిస్తున్నట్టు చెపుతోంది.
"అర్ధం చేసుకోరా! నువ్వంటే నాకెంత ఇష్టమైనా నువ్వు కేవలం నా స్వప్నానివి.వాస్తవానివి కాదు. మన ఈ కలయికలు ప్రతీ రాత్రి నేను కనే అందమైన కలలు. అంతే!"
"మరైతే నన్నెందుకు కల గన్నావు?" నేను కోపంతో అరిచాను." నన్నెందుకు నీ కలల్లో సృష్టించుకున్నావు?? నాతో ఎందుకు స్నేహం చేసావు? నీ కష్టాలు, సుఖాలు నాతో ఎందుకు పంచుకున్నావు??"
ఆమె తల వంచుకుంది.
"ఏమో! నా భావాలను పంచుకునేందుకు ఒక అందమైన ప్రేమికుడు కావాలని నేను ఆశ పడ్దానేమో! అందుకే నా మనసు కలల్లో నిన్ను సృష్టించి ఉండవచ్చు! అందుకే, పుస్తకాల్లో, సినిమాల్లో చూసిన సంఘటనలే నీతో జరిగినట్టు కలలు కని ఉండవచ్చు. అందుకే నాకు నిజ జీవితంలో ప్రేమికుడు దొరకగానే నీ కలలు రావడం ఆగిపోయాయి. అందుకే నేను నీకు ఈ స్వప్నలోకంలో కనిపించలేదు.
కానీ రేపు నా పెళ్ళి. ఎందుకో మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు. అందుకే మళ్ళీ ఈ కల..."
నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.
తను కొనసాగించింది.
"బహుశా, నిన్ను ఏ రోడ్డు మీదో, రైలు లోంచో క్షణకాలం చూసి ఉంటాను. ఆ రూపాన్నే నా మనసు నా కలల ప్రేమికుడిగా పరిచయం చేసి ఉంటుంది"
నాకు ఏడుపు వచ్చింది.
"అంతేనా? నేను కేవలం నీ కలనేనా! ఇంకేమి కానా??"
తన గొంతు గద్గదమయింది.
"కాదురా! నువ్వు నా కలవు మాత్రమే కాదు. ఆ దశని నువ్వు ఎప్పుడో దాటిపోయావు. నువ్వు నా జ్నాపకానివి. ప్రతీ అమ్మాయీ తన ప్రియుడి గురించి కలలు గంటుంది. నువ్వు నా కలలోకొచ్చి నా ప్రియుడివయ్యావు.కానీ వాస్తవాన్ని నేను మార్చలేను. మళ్ళీ నీ గురించి కల గంటానో లేదో నాకు తెలియదు. అంటే మళ్ళీ నిన్ను చూడటం కుదరకపోవచ్చు..."

తను నా గుండెలపై వాలింది. నేను తన భుజాలపై తల వాల్చాను. అలా ఎంత సేపు గడిచిందో తెలియదు. తను
అంది.
"నాకు మెలుకువ రాకుండా ఉంటే బావుండునురా!"
కాసేపటిలో చేజారిపోతున్నదని తెలిసినా నేను ఆమెని గట్టిగా పొదివి పట్టుకున్నాను.
అంజలికి మెలుకువ వచ్చే సమయం, నా స్వప్నాంజలి నాకు వీడ్కోలు పలికే సమయం వస్తుందని భయపడుతూ కళ్ళు మూసుకున్నాను.
****************************
కథ వెనుక కధ:
ఇక్కడి దాకా చదివాక కూడా మీకు మతి భ్రమించకుండా ఉంటే ఇహ ముందుకు వెళ్ళండి.
నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఎల్లా చెప్పానో, ఎంత వరకూ succeed అయ్యనో నాకు తెలియదు. మొత్తం కధ రాసిన తరువాత ఓ సారి చదివితే బాగుందనిపించింది. మళ్ళీఇంకోసారి చదివితే నాకు పిచ్చి ఎక్కిందేమో నని భయం వేసింది. సర్లే, మనకి ఫ్రీ గా ఓ బ్లాగు ఉంది కదా అందులో రాసి జనాలని హింసించేద్దామని ఇలా ఎక్కించేసా...
అవిడియా వచ్చినప్పుడు చంకలు గుద్దుకున్నాను గానీ చదివిన తరువాత ఈ కధ పైన్ జిమ్ కేరీ "Eternal Sunshine of the spotless mind", "Truman Show" సినిమాల ప్రభావం ఉందని అర్ధమైంది. అప్పటికే too late!
మిమ్మల్ని హింసిస్తే క్షంతవ్యుడని!