Thursday, January 29, 2009

పెళ్ళి-పెటాకులు

గత కొద్ది రోజులుగా స్త్రీ హక్కులు,స్త్రీ సమానత్వం గురించి చర్చలు వేడిగా జరుగుతున్నాయి.వీటి గురించి ఆలోచిస్తుంటే ఓ అంశం స్ఫురించింది.అసలు ఇప్పటి దాకా ఈ అవిడియా ఎందుకు రాలేదా అని నన్ను నేనే తిట్టుకున్నాను.గత 140 ఏళ్ళుగా వర్ధిల్లుతున్న ఆ కాన్సెప్టు  పేరు alimony.తెలుగు పదం తెలిసి చావదు."భరణం" అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
   మన పీనల్ కోడు ప్రకారం విడాకులు తీసుకున్న జంటల్లో మగవాడికి తగిలే బంపర్ సిక్కిం లాటరీ ఈ భరణం. అంటే తన మాజీ భార్య పోషణ అన్నమాట!అసలు తన మాజీ భార్య ని పోషించాల్సిన భాద్యత సదరు భర్తకెందుకుందో నా మట్టి బుర్రకు అర్ధం కాలేదు.అయినా ఏం సదుద్దేశం లేకుండా కోర్టు వారు ఎందుకీ రూలు పెడతారనుకున్నాను.అప్పుడు కూర్చుని అసలు ఈ భరణం తాలూకు వివరాలు నెట్లో వెతకడం మొదలెట్టాను. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

   ".... a woman is entitled to maintenance if her personal income is insufficient to maintain the standard of living she was accustomed to while living with her husband.' అని సుప్రీమ్ కోర్టు వారి ఉవాచ.

అంటే ముచ్చటపడి మీ శ్రీమతిని భోగభాగ్యాలలో ముంచి తేల్చారనుకోండి,విడాకులయిన తర్వాత రక్త కన్నీరే మీకు!

On a serious note,నిజంగా ఈ భరణం అనే కాన్సెప్టు...it doesn't make sense to me! 

 ఎందుకయ్యా ఇంత ఆక్రోశం అంటే... చట్టం చాలా లొసుగులిచ్చింది స్త్రీ కి ఈ విషయంలో...స్త్రీ తనని తాను పోషించుకునే స్థితి కి చేరుకునే వరకూ temporary alimony,ఒకవేళ ఆమె పోషించుకోలేదని కోర్టు భావించిన పక్షంలో permanent alimony సమర్పించుకోవాల్సి ఉంటుందిట.అసలు ఒక స్త్రీ ని పోషించాల్సిన భాధ్యత పురుషుడిదేనా?తన కాళ్ళమీద 
నిలబడవలసిన responsibility ఆమె కు లేదా?? Why the hell should i care  if she is incapable of feeding herself??

 ఆశ్చర్యమేమిటంటే విదేశాల చట్టాల్లో ఈ alimony విషయంలో spouse అన్న మాట ఉపయోగించడం జరిగింది. అంటే, సందర్భాన్ని బట్టి భర్తయినా,భార్యయినా భరణానికి అర్ఘులే అన్నమాట!
భర్త సంపాదన నామమాత్రంగా ఉండి భార్య ఎక్కువ సంపాదిస్తుంటే భార్యే భరణం చెల్లించవలసి ఉంటుందన్నమాట.కానీ మన పీనల్ కోడ్ లో మాత్రం 'Husband pays wife' అన్న అర్ధం మాత్రమే ఉంది.
agreed.1869 నాటికి పరిస్థితులు వేరు.ఒక అమెండ్మెంటు చెయ్యచ్చు కదా!


 కట్నం మీద నాకెప్పుడూ సదభిప్రాయం లేదు.వివాహమనేది ఒక స్త్రీ పురుషులిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం,ఇద్దరి జీవితాలు significant changes కి గురి అవుతాయి.ఒకరి వద్ద ఇంకొకరు డబ్బు తీసుకోవడం greed తప్ప మరేమీ కాదనుకునేవాడిని.కానీ ఇప్పుడాలోచిస్తుంటే కట్నం తీసుకోవడం....it makes sense.కాకపోతే దాన్ని నేను caution deposit గా పిలుస్తాను.
రేపు మేము విడాకులు తీసుకుంటే నాకున్న విశాల భావాలే కోర్టుకుండవు కదా!నా భార్యకు భరణం ఇవ్వాల్సిందేనంటుంది,తను ఉద్యోగం చేస్తున్నా కూడా!అప్పుడు ఈ caution deposit ఉపయోగపడుతుంది నాకు.కాదూ,కూడదూ అనుకుంటే పెళ్ళికి ముందే ఒక లీగల్ అగ్రిమెంటు మీద సంతకం చేయించుకోవాలి,విడాకులయిన పక్షంలో నాకు భరణం అక్కర్లేద్దూ... అని. ఎందుకంటే,as i see it,women can't have their cake and eat it too...

నా ఈ ఆలోచనలు చాలా క్రూడ్ గా ఉండవచ్చు.ఇవి ఇంకా ఇప్పుడే వచ్చాయి నా మెదడులోకి.i've to think over them to come to an opinion. అందుకే ఈ పోస్టు.
నా వాదనలో లోపం కనబడితే ఏమిటో చెప్పండి.స్త్రీకి భరణం ఇవ్వాలని మీరనుకుంటే మీ point of view చెప్పండి.కానీ దయచేసి "వివాహం ఒక పవిత్రమైన వ్యవస్థ.మన సంస్కృతిలో స్త్రీకి మహోన్నత స్థానం ఉంది" ఇలాంటి సలహాలు వద్దు.

SHOOT!

3 comments:

Anonymous said...

ఏం మీ ఆవిడకు విడాకులిద్దాం అనుకుంటున్నారా??????ఏమీ లేదు స్త్రీ భరణాల మీద పడితే డవుటొచ్చింది

సురెందర్ said...

అప్పటి వరకు భర్తకు, ఇంటిల్లిపాదికి వెట్టి చాకిరి చేస్తూ అనుకోకుండా విడాకులదాకా వచ్చిన స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కనీసం తన భర్త నుండి కోర్టు ద్వార ఇప్పించబడే భరణమే తనకు తన పిల్లలకు దిక్కైతే, ఆ పరిస్థితులలో మీరే ఉంటే మీరు పై విధంగా మట్లాడరు.

Unknown said...

" Cautioin Deposit " అన్నా ఇంకేదో పేరు పెట్టినా కట్నాన్ని నేను సమర్ధించలేను. నేను మాత్రం భరణానికి వ్యతిరేకం కాదు. ఒకరితో జీవితాన్ని మద్యలోనే ముగించినందుకు దాన్ని జరిమానాగా భావిస్తాను నేను. అయితే విడాకుల విషయంలో ప్రతీసారీ మగవాడిదే తప్పవ్వాలని నియమమేమీ లేదు కనుక ఒక్కో సారి మగవారికి అన్యాయం జరగవచ్చు.