Friday, October 5, 2007

దొరకునా ఇటువంటి సేవ?...

అంతా క్షణాల్లో జరిగిపోయింది.మెయిల్ రావడం,సామాన్లు సర్దుకోవడం,రైలు ఎక్కడం,డిల్లీ లో దిగడం ILP కి రావడం... అంతా కలలా ఉంది.

అక్కడి నుంచి మొదలయ్యాయి నా కష్టాలు.ILP అంటే ఎదో........ఊహించుకున్న నాకు REALITY చూడగానె భళ్ళుమని ఎదో పగిలిన శబ్దం వినిపించింది. అది నా గుండె అని ఒక సెకను తర్వాత అర్థమైంది.హాస్టల్ తాజ్ బంజారా లెవెల్లో ఊహించుకున్నాను. ఇది చూస్తే శ్రీ దుర్గా భవాని లాడ్జ్ లెవెల్లో ఉంది.పొన్లే పాపం , మన కంపెనీ యే కదా సర్దుకుపొదామనుకున్నాను.

నాకు నోట్లో నాలుక లేదని వాడికి తెలిసిపొయినట్టుంది. ఇద్దరు ఉండాల్సిన రూం లో ముగ్గురిని కుక్కాడు. పైగా అని ఒక లెటరు చేతిలో పెట్టాడు. రూము మళ్ళీ డిటొ దుర్గా భవాని విలాస్.

అసలే ఆకలి మీద ఉన్నానేమో వెంటనే భోజనానికి వెళ్ళాను.చూడ్డానికి ప్లేటు ఫుల్లుగానే ఉంది.అన్నం పసుపుగా ఉంది. పప్పు లో వెయ్యాల్సిన ఉప్పంతా తీస్కొచ్చి మజ్జిగ లో వేసాడు.
(ఒక శుభ దినాన అన్నం లో స్క్రూ వచ్చింది. అది వేరే సంగతి. )
ఒక పదార్ధాన్ని చూపించి అది స్వీటా హాటా అన్నాను. వాడు ఏమో అన్నాడు. అప్పుడినా నేను ఆగచ్చు కదా? పెద్ద హీరో లాగ టేస్టు చేసాను.


దిమ్మ తిరిగి మైండు బ్లాకైంది.దెబ్బకి రూము కి వెళ్ళి మంచం మీద పడి నిద్ర పోయాను.

ఇక్కడ ఉన్న సీనియర్లు రకరకాల కష్టాలు చెప్పి మమ్మల్ని ఎంటర్ టైన్ చేసారు. "దోమలున్నాయి జాగర్త" అని నోటిసు కూడా కనిపించింది.

క్లాసులు మొదలయ్యాక ఇక మా భాధలు చెప్పనలవి కాదు.
ఇది కాలేజ్ కాదంటారు. మేము స్టూడెంట్స్ కాదంటారు. కాని మేము హోం వర్కులు చెయ్యాలి. అస్సైన్మెంట్లు రాయాలి.ఎగ్జాములకి చదవాలి.

ఓ సారి మాకు "జీతం పెంచామహో"అని నోటీసు వచింది.
దెబ్బకి ఒక్కళ్ళు డ్రీం సాంగులు వేసేస్కున్నాం.
మూడు లక్షలని ఒకడు, నాలుగు అని ఒకడు.....
ఆఖరికి మా బోసు గాదు అరగంట సేపు మీటింగు పెట్టి మాకు నెలకి నలభయ్ రూపాయలు పెంచాం, పండగ చేసుకోమన్నాడు.దెబ్బకి మా ఫేసులు చూడాలి.కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు.

అన్నట్టు మీకు బోసు గురించి చెప్పలేదు కదూ...
ఇక్కడ సుమిత్ బోస్ అని ఒక జీవి ఉంటాడు. సీతయ్య లాగ ఎవడి మాటా వినడు. నవ్వుతూ వాతలు పెట్టే రకం.అసలు ఇల్ప్ ఐపోయేలోపు వీడిని మంకీ కేప్ వేసుకుని చితక్కొట్టెయ్యాలి.


పోన్లే అని వాడిచ్చిన రూముల్లో సర్దుకుపొతుంటే ఇంకో ఫిట్టింగు పెట్టాడు.ఎదో నార్త్ అమ్మాయిలని చూస్కుంటూ భాధలు మర్చిపోతున్న మమ్మల్ని తీస్కెళ్ళి పది కిలోమీటర్ల దూరంలో ఇంకో హాస్టెల్లో పడేసాడు

బీటు కొట్టే యోగం లేకపోతేనేమి, నెట్టు ఉందిగా పండగ చేసుకుందాము అనుకున్నాను.దానికి కూడా వంద షరతులు పెట్టాడు.ఇక్కడా ఆర్కుట్ కాదు కదా జిమైల్ కూడా ఓపెన్ కాదు.

ఈ బ్లాగు రాయడానికి నేను వారం రోజులుగా కష్టపడుతున్నాను.

ఇక చూస్కోండి.మా జీవితం అంతా బస్సు వచ్చిందా? మిస్సైందా? ఎక్కామా? సీటు దొరికిందా? ఇదే గొడవ....

మా చుట్టాలంతా ఢిల్లీ లో జాబ్ అంటే ఎదో.........అనుకుంటున్నారు.వాళ్ళకు తెలియని ఘోర నిజాలు మీ ముందు ఉంచుతున్నాను....

ఒక పెన్ను కొనుక్కోవాలంటే నెను రెండు కిలోమీతర్లు వెళ్ళాలి.

ఒక సినిమా చూడాలంటే గంటా సేపు ప్రయాణం చెయ్యాలి.

ఇక్కడ పెరిగే పురుగుల మీద ప్రయోగాలు చేసి ఏ సైంటిస్టైనా నోబెల్ ప్రైజు కొట్టేయచ్చు.

ఈ సోది అంతా మాకు ఎందుకు? మమ్మల్నేమి చెయ్యమటావు అంటారా?

ఆస్తికులు నా కోసం దేవుణ్ణి ప్రార్థించండి...

నాస్తికులు... పెద్దగా చెయ్యగలిగింది లేదు! నా కోసం ఒక్క కన్నీటి చుక్క రాల్చండి....