ఇల్లు కట్టి చూడు...పెళ్ళి చేసి చూడు... అన్నారు గాని అని శుద్ధ అబద్దం.
ఈ రియల్ ఎస్టేటు వచ్చాక ఎవ్వడూ ఇల్లు కట్టుకోవటం లేదు. కొనుక్కుంటున్నారు.
ఇహ పెళ్ళి అంటారా? మహా మహా మెగా స్టార్లకే పిల్లల పెళ్ళిళ్ళు జరిపించుకునే అద్రుష్టం లేదు.మనమెంత?? అందుకని అదీ వేస్టు.
కాలం తో పాటు సామెతలూ అప్ డేట్ అవుతాయి. అలా పుట్టిన కొత్త సామెత "ఇల్లు వెతికి చూడు...".
ఈ సంగతి మొన్న నాకు మద్రాసు లో రూము వెతుక్కునేటప్పుడు అవగతమైంది. ఓసోస్ ఇల్లే కదా సాయంత్రం అంతా తిరిగితే రాత్రికి దిగిపోవచ్చు అనుకున్నాం గానీ, నిజం చెప్పద్దూ.... దూల తీరిపోయింది.శ్రేయోభిలాషులందరూ బ్రోకరు అనే వాడి అండ లేకుండా పని అవదన్నారు. సర్లే కదా అని ఓ నాలుగు బ్రోకర్ల నంబర్లు సంపాదించి వేట మొదలెట్టాం.
అసలు ఈ సాఫ్టువేరు ఉద్యోగాలు చేసుకోవడం కన్నా ఆ బ్రోకరు పని చేసుకోవడం సులువేమో?? అహాహా... ఏమి దర్జా?? ఏమి స్టైలు?? వాళ్ళేదో సంఘ సేవ చేస్తున్నట్టు మేమేదో వళ్ళ కరుణా కటాక్ష వీక్షణాల మీద ఆధారపడ్డట్టు మట్లాడతారు. పైగా ఇల్లు చూపించినందుకు వీళ్ళకి ఒక నెల రెంటు ఇవ్వాలంట!
ఇహ తిరిగాం చూస్కోండి...ఒకడు వేల్చెరి లో ఖతర్నాక్ ఇల్లు ఉందంటాడు.అక్కడి నుంచీ ఫోనులో దైరక్టు చేస్తాడు. దాన్ని బట్టి మనం ఇల్లు ఎక్కడో పట్టుకోవాలన్న మాట! ఆ ట్రెజరు హంటు ఎల్లాగో సాల్వు చేసి వెళ్ళామా... వాడు చూపించే ఇల్లు నిజంగానే ఖతర్నాక్ సినిమా లాగే ఉంది.
ఇంకో బ్రోకరు నేను బిజీ గా ఉన్నాను సాయంత్రం కాల్ చెయ్యమంటాడు.ఇంకోడికి ఫోనె చేస్తే కొట్టివక్కం రండి.పిచ్చెక్కించేస్తానన్నాడు. మళ్ళీ ట్రెజరు హంటు మామూలే...మీకు గనక చెన్నై టోపోగ్రఫీ తెలిసి ఉంటే మా భాధలు ఇంకా బాగ అర్థం అయ్యేవి.
ఆఖరికి మా పరిస్థితి ఎల్లా తయారయ్యిందంటే.. రోడ్ల వెంట నడిచి నడిచి, ఓపిక చచ్చి, ఆ రోడ్డు పక్కనే కూలబడి ఎవరైనా బిచ్చగాళ్ళని పొరబడి చిల్లర వేస్తారనే భయం తో మా ఐడి కార్డులు కనబడేలా పట్టుకుని... ఆహ... ఆ సీను వెండి తెర మీద చూడాల్సిందే గాని చెప్పాల్సింది కాదు.
అల్లా నాలుగు రోజులు కుక్కల్లా తిరిగితే ఒక ఇల్లు దొరికింది.అమ్మయ్య అనుకున్నాం. కాని ఆ మర్నాటికే పిక్చర్ అభీ బాకీ హై దోస్త్ .....అని అర్థమైంది.మా ఇంటి ఓనరు ఒక నీచ్ కమినే కుత్తే గాడు.వాడి గురించి తల్చుకుంటుంటేనే నా రక్తం మరిగిపోతోంది.మమ్మల్ని ఎన్ని రకాలుగ దోచుకోవచ్చో అన్ని రకాలుగు దోచుకుంటున్నాడు.రోజుకు పది సార్లు వచ్చి ఇన్స్పెక్షను చేస్తాడు.రోజుకు ఒక కొత్త రూలు పెట్టి మా.........(లోక గ్నానం ఉన్న వాళ్ళు పూరించుకోగలరు )
మా పని మనిషి కి కొంచెం అలక ఎక్కువ అంటే అది అండర్ స్టేట్మెంటే అవుతుంది.పాపం నా లవరు కూడా అన్ని సార్లు అలిగి ఉండాదు నా మీద!
ఇవీ మేము మా గ్రుహాన్వేషణలో ఎదుర్కున్నట్టి ఎదుర్కుంటున్నట్టి కష్టాలు.గత పోస్టులో నొఇడా గురించి ఆవేశం లో అవాకులు చెవాకులు వాగినందుకు మీ అందరి సమక్షంలో లెంపలు వేశుకుంటున్నాను.ఇప్పటి మా లైఫు తో పోలిస్తే అది కేక!అరుపులు!! మెరుపులు!!!
కొసమెరుపు: ఈ పదిహేను రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే చెన్నై లో ఉద్యోగం చెయ్యడం కన్నా చిన్న కాకా హోటలు పెట్టుకోవడం బెస్టు.ఇంకా రిచ్చు గా బతకాలంటే ఒక ఆటో నడుపుకుంటే సరి...
శ్రీ మద్రమారమణగోవిందో హరి!!!
Friday, November 23, 2007
Subscribe to:
Posts (Atom)