ఇంజనీరింగ్ కోసం భీమవరం రాగానే నేను తిన్న షాకులు ఇన్నీ అన్నీ కాదు. కానీ, అన్నిటికన్నా ఎక్కువగా నన్ను బాధ పెట్టింది మాత్రం "కులం" అన్న పదం.
మీకు వెర్రితనంగా కనిపించవచ్చేమో గానీ, నేను అప్పటిదాకా ఈ కులం గిలం అనే ఫీలింగులన్నీ పెద్దవాళ్ళకే, మా "యంగ్ జనరేషన్" కి లేవు అనుకునేవాణ్ణి. అవును మరి, అప్పటిదాకా నా స్నేహితులతో అలాంటి చర్చ రాలేదు.
అసలు వాళ్ళది ఏ కులమో అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. మరి ఇంజనీరింగ్ లో.....
****************************
మొదటి రోజు. నాన్న నన్ను దింపి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రే డాబా మీద నాకు "కులోపదేశం" జరిగింది.
"ఏమ్ కేస్టు..?" పేరు,ఊరు చెప్పిన వెంటనే వచ్చిన ప్రశ్న అది.
నాకు ఒక నిముషం ఏమ్ విన్నానో అర్ధం కాలేదు. అర్ధమయ్యాక చెప్పాను. సీనియర్ నవ్వాడు. పక్కనే ఉన్న ఇంకో జూనియర్ ని అడిగాడు. వాడూ చెప్పాడు. వాడిని వెంటనే ఇంకో సీనియర్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ప్రశ్నార్ధకం గా చూస్తున్న నాతో మొదటి సీనియరు "వాళ్ళోడే...." అన్నాడు. ఆ తర్వాత అతడి ఉపదేశం ఈ విధంగా సాగింది.
"చూడు తమ్ముడూ..! రేపు మనోళ్ళని పరిచయం చేస్తాను. టచ్ లో ఉండు. రేప్పుద్దున్న నీకేదైనా అవసరం వస్తే నీ ఫ్రెండ్సెవరూ సాయం చెయ్యరు. మనోళ్ళే చేస్తారు."
"ఈ ఊరులో *******ల డామినేషను ఎక్కువ!"
"మీ క్లాసు లో ఇంకా ఎవరెవరు మనోళ్ళునారో కనుక్కో! రేపు సాయంత్రం నాకు ఇవ్వాలి."
ఆ రోజు రాత్రి దుప్పటి ముసుగు కప్పుకుని వెక్కి వెక్కి ఏడిచాను. అది ర్యాగింగు వల్లా? ఇల్లు గుర్తురావడం వల్లా?నా ఒక చిన్న నమ్మకం నిర్ధాక్షిణ్యంగా నలిపివేయబడటం వల్లా అంటే మాత్రం చెప్పలేను.
On that night my little belief about the pristinity of young generation was shattered!
మా రూమ్మేటు ది కూడా అదే పరిస్థితి. నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగారా?? నీ కులం వాడి పేరే చెప్పాలి. వాడు ఒక హిట్టిచ్చి పదేళ్ళవుతున్నా, ఇంకా ఆప్పుడప్పుడే సినిమాలు చేస్తున్న బుడ్డోడైనా సరే..!
అదే నిన్ను ర్యాగింగ్ చేస్తున్నది వేరే కులం వాడైతే న్యూట్రల్ గా ఉండే పేరేదైనా చెప్పాలి.
"వాడితో తీసుకున్నావేరా రూము? మన వాళ్ళెవరూ దొరకలేదా??"
"ఒరేయ్! అక్కడ ఎవరో మన అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారట. పదండ్రా!"
కులం బలవంతంగా నరాల్లోకి ఇంజెక్టు చెయ్యబడుతుంది. you can't help it!
ఈ ఉన్మాదానికి పరాకాష్ట "కుల పండగలు". జనవరి లో వీటి హడావిడి మొదలవుతుంది. ప్రతీ కులానికి ఒక గ్యాంగ్ తయారై నాయకత్వ భాద్యతలు నెత్తిన వేసుకుంటుంది.
కాలేజ్ యాజమాన్యానికి తెలియకుండా రహస్యంగా ఏర్పాట్లు జరుగుతాయి. నేను రాను అని చెప్పినందుకు ఒక సీనియరు నాకిచ్చిన వివరణ ఇలా ఉంది.
" మేమేమీ కుల పిచ్చోళ్ళం కాదురా!ఏదో కొన్ని గంటలు సరదాగా
డాన్సులు కడతాం. అమ్మాయిలతో కబుర్లు చెబుతాం. తింటాం. వచ్చేస్తాం. ఈ మాత్రం దానికి పెద్ద సిద్ధాంతాలు,రాద్ధాంతాలు ఎందుకు బే??"
మరి నాకు ఈ "మనం" అన్న పదం దగ్గరే చిరాకొస్తోందే..?
ఈ కుల పండగల అజెండా ఇదీ....
అయా కులానికి చెందిన local heroes ని అతిధులుగా పిలుస్తారు.వారు ఆ కుల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రసంగిస్తారు.
తమ కుల హీరో పాటలకు డాన్సులు వెయ్యడం, వేరే కుల హీరోలని వేళాకోళం చేస్తూ skits చేయడం, and ofcourse flirting with the opposite sex of same caste!
it's a god damn brainwash!!!
మొత్తానికి కొన్ని నెలల వ్యవధిలో తెల్ల కాగితం లాంటి ఫ్రెషర్ మనసు మీద "కులకోటి" రాయబడుతుంది. ఆ పై సంవత్సరం వృత్తం మళ్ళీ మొదలవుతుంది.
ఇది కేవలం మా కాలేజ్ కే పరిమితం కాదు. నాకు తెల్సి ప్రతీ ఇంజనిరింగ్ కాలేజ్ లో జరిగేదే..! కాకపోతే dominant caste మారుతుంది అంతే.....
*******************************
నేనూ ఈ brainwash కు అతీతుడిని కాదు. సీనియర్ల వత్తిడి భరించలేక ఒక ఏడాది ఈ పండగకి వెళ్ళాను.
అప్పుడప్పుడూ నాలోనూ ఎక్కడో ఈ ఫీలింగ్ ఉందని నిరూపించే ఘటనలు జరుగుతుంటాయి. పేపర్లో ఎక్కడో నా కులం వాడికి ఎదైనా అవార్డు వచ్చిందని చదివినప్పుడు, ఎవరైనా పరిచయం చేసుకుంటూ తమ పేరు చెప్పినప్పుడు ఆ పేరులోexplicit గా నా కులం పేరు ఉన్నపుడు క్షణకాలం మనసులో ఎదో మెరుపు! మరుక్షణం సిగ్గేస్తుంది. ఆ తర్వాత దీనికి కారణమైన సీనియర్లపై కోపం వస్తుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత! అప్పుడు నాకు నేనే సర్దిచెప్పుకుంటాను.
"May be i have a bit of involuntary caste feeling. But atleast, i am not proud of it! "
14 comments:
చాలా చక్కగా రాసారు.కులం,దాని ప్రభావం మీద ఈ మధ్య కాలంలో ఇంత నిజాయితీగా వచ్చిన టపా నా దృష్తిలో మాత్రం మీదే.
"మహా"అనుకున్న వారికే ఈ లింకులు,బొంకులు తప్పలేదు.మనమనగా ఎంతటివారం
కులం నిజం,మతం,ప్రాంతం,వగైరాలన్నీ నమ్మకాలు.ఇది అసంఖ్యాంకమైన ఉదాహరణలతో ఋజువైన సత్యం.
చక్కగా వివరించారు మీ వ్యధని.
నాకయితే చదువుకున్న తిరపతి లో ఈ గొడవలు కనపడలేదు. దానికి కొంచెం సంతోషపడాలేమో. కాకపోతే ఇదిగో ఈ అమెరికాలో నే అటువంటివి బాగా కనిపిస్తున్నాయ్. కొంచెం డబ్బున్నోడి లాగా కనిపిస్తే మనోడేమో రేయ్ అని ఒకడు. కొంచెం రోషంగా ఇరగదీస్తా రేయ్ అంటే ఒహో ఈడు మనోడే రేయ్ అనే వాడు ఒకడు.ఏదో సంస్కృతి అని మాట్లాడితే వీడు మనోడు రేయ్ అని భుజాల మీద చెయ్యి పెట్టి తడిమే వాడు ఇంకోడు.
ఇది ఎక్కడి కెళ్ళినా మారదు. అయితే కుల గ్యాంగులు లేక పోతే జిల్లా గ్యాంగులు. మనమే వాటి అనుగుణంగా మారి పోవాలి.
దీని మీదో టపా రాయాలి తొందర్లో.
-- విహారి
@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ధన్యవాదాలండి.
@ విహారి
మీ వ్యాఖ్య తో నాలో ఇంకో ఆలోచన రేగింది.కులతత్వం కనబడిన చెడ్డగా వీడు మా ఏరియా వాడు అనుకుంటే చెడ్డగా అనిపించదు నాకు. ఒకవేళ అది కూడా తప్పే అని మీరంటే మరి వీడు మన తెలుగు వాడే అనుకోవడం కూడా తప్పా?? అలాగే వీడు మన భారతీయుడు అనుకోవడం కూడానా??? ఇవన్నీ తప్పు కాదు అనుకుంటే కులతత్వం ఎందుకు తప్పవుతుంది??
నన్ను నేనే contradict చేసుకుంటున్నాను కదా!
నా వాదనలో ఎక్కడో flaw ఉందని తెలుసు. ఎక్కడో అర్ధం కావటం లేదు. మీ లాంటి బ్లాగ్దిగ్గజాలే నా ఈ
సమస్య ని తీర్చగలరు.
మీ నిజాయితీ మెచ్చుకోదగ్గది. మీపదవలో నేనూ పయనించాను.
మీ ఊహలూ సరియైన తోవలోనే నడుస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష,వృత్తి,వర్గం, జాతి,దేశం - ఇందులో ఒకదాన్ని అభిమానించడం తప్పయితే మిగతా వాటిని అభిమానించడమూ తప్పే, విస్తృతిలోనే తేడా.
వీటన్నిటికీ అతీతమైన సర్వ మానవసౌభ్రాతృత్వం మనకు ఆదర్శంగా ఉండాలి. అయితే చెప్పడం తేలికే గానీ మనం మామూలు మనుషులం. అంతే కాకుండా మానవజాతి మనుగడ అంతా గుంపులుగా కూడటం పైనే ఆధారపడి ఉంది, ఆ గుంపు కట్టడం దేనిమీద ఆధారపడి ఉన్నప్పటికీ.
సమస్య ఎందుకు వస్తుందంటే నా కులం నీ కులం కంటే గొప్పది, నా మతం నీ మతం కంటే ఉన్నతం, నా దేశం నీ దేశం కంటే ఘనం అన్న మౌడ్యం, అహంకారం పెరిగిపోవడం వల్ల. మన వ్యక్తిత్వాలకంటే ఈ పైవాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.
దురభిమానం పెంచుకోనంతవరకూ దాని గురించి అంత బాధపడవలసిన పనిలేదని నా నమ్మకం.
"I have built barriers about me throght out my life and they are shading me in gloom now" (not the exact words) says Rabindra Nath in his master piece.
What ever you build about is a barrier for you at the end. I think we shall forgo these petty feeligs like caste, re(li)gion even if they are "broad" like nationality. Yeah I know it is easier said but can be easier done provided you folow your super ego.
మీరన్నది సబబే. నేను కూడా ఆ కన్‌క్లూషన్ కు వచ్చేశానేమో అనిపిస్తుంది. మన ఏరియా వాడు అన్నది కొంత వరకూ ఓకే. అవతలి ఏరియా వాళ్ళు పప్పు సుద్ధలు. మేము తెలివయిన వాళ్ళు అనే దశకు చేరుకోకుండా వుంటే చాలు.
ఈ ఏరియా పిచ్చివాళ్ళ గురించి నేను పూర్తిగా చెప్పలేదేమో. నేను చెప్పేది అంతకు ముందు ఎవడైనా ఒకే మనోడు అని అంటూ, వాళ్ళ ఏరియా వాడు రాగానే నువ్వు వేరు, నేను వేరు అనే ధోరణిలో వుండ కుండా వుంటే చాలు.
నేను దిగ్గజాన్ని కానండి బాబూ. ఎక్కువ కాలంగా బ్లాగు తున్నానంతే :-)
-- విహారి
@ all
మీ చర్చ తో కొద్దిగా clarity వచ్చింది.
ధన్యవాదాలు.
Excellent work.. unnadi unnattu gaa aksharaalu gaa malichaaru.. johaarlu!!
ee "manam" daggare naaku nacchadu annaru gaa.. "manam" samyaanukoolamgaa maarutundi, "manam" ki kacchitatvam ledu. mana "kulam" antoo giri geesuku koorchovatam tappu aithe .. mana "jaati" antoo viswamaanavaalini dooram chesukovatam koodaa tappe!!
naaku ancche ati takkuva blogs lo meedi okati.:-)
@purnima
విహారి గారికి ఇచ్చిన జవాబులో సరిగ్గా నేనూ అదే మధనపడ్డానండీ. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
ఐతే మనకీ ఫాన్సు ఉన్నారన్నమాట. అదేంటో నాకు సడన్ గా నేలకు నాలుగడుగుల ఎత్తులో నడుస్తున్నట్టుంది!! ఎవరైనా కొద్దిగా కిందకు దింపుదురూ....
సందీప్ గారు
మీ భాధ నేను అర్థం చేసుకోగలను. కానీ, నిరాశ పడకండి. కులం అనేది అంత సింపులుగా వదిలిపోదు. జనాభా మొత్తం విద్యావంతులైతే తప్ప ఇలాంటి ఆలోచనలు పోవు.
అక్షరం వ్రాత అనేది కనుగొనే ముందు సమాజం అంతా జాతి, తెగల మధ్య నడిచేది. మనదేశంలో నిరక్షరాస్యులు ఇంకా 40% ఉన్నారు. జాతి భావన అందుకని అలాగే ఉంటుంది. మనం చదువుకుంటే సరిపోదు. మనతో మాట్లాడేవాళ్ళు కూడా అందరూ చదువు తెలిసిన వాళ్ళు ఉండాలి. లేదంటే వారి భావజాలం కూడా మనపై మబ్బులా చేరుకుంటుంది.
మీ ఇంజనీరింగు కాలేజిలో పిల్లల కుటుంబాలలో చదువురానివారు బాగానే ఉండి ఉంటారు (తాతయ్యలు, కొన్నిసార్లు మామయ్యలు, అప్పుడప్పుడు తల్లిదండ్రులు) వారి ఆలోచనాసరళి పిల్లలపై ఆటోమేటిక్కుగా పడుతుంది.
:-) కులం సంగతి పక్కన పెడితే మాదీ కాకినాడే. :-) కాకినాడ బీచితో స్పెషల్ అనుబంధం. ఇక కులం విషయానికి వస్తే ఇంజనీరింగు కాలేజిలో నేను కూడా చవిచూసాను. మొదట్లో వ్యతిరేకించాను.. తర్వాత give-in అన్నాను. తర్వాత నన్ను నేను సమర్థించుకున్నాను.. ప్రాంతం, భాష, వృత్తి, వర్గం లాగ ఏ కారణం చెప్తేనేమి, ఆ కారణంతో పరిచయం, నచ్చితే స్నేహం చేస్తే తప్పు లేదు, గొడవ చేస్తే తప్ప అని. కానీ ఇంజనీరింగు కాలేజిల్లో జరిగేది స్నేహం మాత్రమే కాదు.. మనం గొప్ప, పక్కవాడు ఎదవ అని ఒకరకమైన వైరం కూడా నూరిపోయడం జరుగుతుంది కొంతవరకు. దానికి రిజర్వేషన్లు అనే కారణంగా ఇంకో వర్గవిభజన కూడా తోడవుతుంది OC, BC, SC, ST అని.
@Ray Lightning
మీరు పొరబడుతున్నారు. ఈ జాడ్యానికీ, చదువుకీ ఏ మాత్రం సంబంధం లేదు. మా కాలేజ్ లో ఉన్నవాళ్లంతా చదువుకున్న వాళ్ళేగా. అదే నేను ఆశ్చర్యపోయింది. ఇంతా చదువుకుంటూ ఈ భావాలేంటని. మరి ఈ తరమేగా రేపు పెద్దదయ్యేది. పిల్లలకి నేర్పేది.
ఈ మహమ్మారి near future లో వదిలే అవకాశం నాకైతే కనిపించట్లేదు.
@ చేతన గారు.
మీదీ కాకినాడేనా?? చాలా సంతోషమండీ.
మీరే కాదు. చాలా మంది అలా లొంగిపోయినవాళ్ళే.
మారకపోతే అంతా పొగరనుకుంటారన్న భయం ఒకటి.
దీనికి సమాధానం ఎక్కడ వెతకాలో ఏమిటో??
Post a Comment