ఈ పరిస్థితి మీలో చాలా మంది face చేసే ఉంటారు.ఐతే వాళ్ళు సర్దుకుంటారు. లేకుంటే మనల్ని సర్దుకోమంటారు. నాలా ఒంటరి గా సినిమాలకి వెళ్ళే రకాలనైతే ఇంకానూ... అడిగే వాళ్ల కంఠంలో రిక్వెస్టు పాళ్ళు తక్కువగా, కమాండు పాళ్ళు ఎక్కువగా అనిపిస్తుంది.
అంతెందుకు, మనమే ఒక నలుగురం స్నేహితులం, ఇద్దరు ఆడ, ఇద్దరు మగ కలిసి సినిమాకి వెళ్ళామనుకోండి. మగాళ్లం ఇద్దరం ఆ చివరా ఈ చివరా కూర్చుని అమ్మాయిలని మధ్యలో కూర్చోబెడతామా లేదా??
నా బాధల్లా ఇదే... " ఏమిటీ దుస్థితి? ఎందుకీ దుస్థితి??"
i mean, ఒక స్త్రీ ఒక మగాడి పక్కన ఒక మూడు గంటలు కూర్చుంటే what's the big deal??
ఎందుకు మనం ఆమెని protect చెయ్యడానికి try చేస్తున్నాం??
ఎక్కడో చదివాను. బెడ్ రూములో పురుషుడు ఎప్పుడూ తలుపు ఉండే వైపు పడుకుంటాడట. స్త్రీ గోడ ఉండే వైపు పడుకుంటుందట. రాతియుగం కాలం నుంచి శత్రువుల నుంచి తన వాళ్ళని రక్షించుకోవాలనే instinct వల్ల subconsious గా అలా చేస్తామట. ఇది కూడా అలాగేనా??
ఊహూ. కాదు. ఇది మనం consious గా తీసుకునే నిర్ణయమే! but we would like to believe it was a subconsious choice!!
అసలు ఇంత చిన్న విషయానికి ఇంత ఆలోచించే పరిస్థితి ఎందుకు ఉంది???
అసలు సమస్య ఎక్కడ ఉంది??
చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళంటే వాళ్ళో అపురూపమైన వస్తువన్న భావన కలిగేలా ఉంటాయి పరిసరాలు.
బస్సుల్లో సెపరేటు సీట్లు.
రైళ్ళళ్ళో సెపరేటు బోగీలు.
సినిమా హాళ్ళ దగ్గర సెపరేటు క్యూలు...(ఇంకా నయం, సినిమా హాళ్లళ్ళో కూడా సిటీ బస్సుల్లోలాగా కుడి వైపు మగాళ్ళు, ఎడం వైపు ఆడాళ్ళు అని పెట్టలేదు.)
కాలేజీలో సెపరేటు సెక్షన్లు.
అన్నయ్య గారూ అని వరస కలిపితే గానీ ఆడవాళ్లకి పక్కింటి మగాడితో మాట్లాడలేని స్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన మగవాడికి ఆడదాని స్పర్శ తగిలితేనే వికారపు అలోచనలు వస్తాయంటే రావా మరి??
నాకు తెలుసు మీరేమంటారో. సెపరేటు బోగీలు, సీట్లు ఉంటేనే ఆడవాళ్లకు రక్షణ అంతంత మాత్రంగా ఉంది. అంతా కలిపేస్తే ఇక వాళ్ళు బతకగలరా???
నిజమే!
actual గా ఇది ఒక catch 22 situation.
ప్రజల mindset మారితే గానీ పైవన్నీ సాధ్యపడవు.
పైవన్నీ జరిగితే గానీ ప్రజల mindset మారదు.
మరి solution ఏమిటో తెలిదు గానీ నా ఊహల్లో మన దేశంలో
ఈ సెపరేటు కౌంటర్లు,సీట్లు ఉండవు.
ఎక్కడైనా స్త్రీ,పురుషులు ఏ బిడియం లేకుండా పక్కపక్కన కూర్చుంటారు.
at the same time, స్త్రీ స్పర్శ తగిలినంతనే వికారపు ఆలోచనలు మగవాడికి రావు.
నాకు తెలుసు. నా జీవిత కాలంలో ఇవన్నీ జరిగే అవకాశం తక్కువే. అప్పటి దాకా ఈ " లేడీసుతో వచ్చాం, కొంచెం సర్దుకుంటారా?" అనే అభ్యర్ధనలు నాకు వినిపిస్తూనే ఉంటాయి
(ఎందుకో నా భావాలను అనుకున్నంతగా convey చెయ్యలేకపోయా!)
update:
నిన్న బస్సులో వెళ్తున్నా. ఒక యువజంట కూర్చునిఉంది. నా ధియరీ ప్రకారం అమ్మాయి కిటికి పక్కన కుర్చుని ఉంది. అబ్బాయి ఆ పక్కన కుర్చున్నాడు. పక్కన నిలబడ్డ ఇద్దరు మహానుభావులు ఆమెను చూపుల్తో తినేస్తున్నారు.
అదే ఆ అమ్మాయి వాళ్లకి అందుబాటులో కూర్చుని ఉంటే ఏమి చేసేవాళ్ళా అని అలోచించడానికే భయం వేసింది.
ఆ క్షణాన నాకు సుజాత గారి వ్యాఖ్యలో సత్యం అర్ధమైంది.
15 comments:
సాధారణంగా జరిగే ఈ విషయంలోని ‘సోషియాలజీ’ గురించి బాగా చెప్పేప్రయత్నం చేసారు. నేనుకూడా ఇలా చాలాసార్లు అనుకున్నా,వ్యాసం గా రాస్తే దానికి ముగింపు ఎలాచెప్పాలో తెలియక ప్రయత్నించలేదు. బహుశా, ఆఖర్లో మీరు "చెప్పాల్సింది చెప్పలే"దనుకోవడానికి కారణం కూడా అదేకావచ్చు.
ఏదిఏమైనా,ఒక విభిన్నమైన ‘అంటరానితన్నాన్ని’గురించి చాలా సున్నితంగా లేవనెత్తారు.ఇలాంటి సమస్యలు సమూలంగా మారవుగానీ, తీరులలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.
ఆడవాళ్ళని తమ "షోల్డరింగ్" కుతితో ఇబ్బందిపెట్టే వెధవలున్నంతవరకూ,అనవసరంగా రక్షకులయ్యే మగవాళ్ళూ ఉండక తప్పదు.
www.parnashaala.blogspot.com
మీరెక్కడి అనుభవంతో చెప్పారో తెలీదు కానీ, బెంగళూరు లో సెపరేట్ కౌంటర్స్ పోయి చాలా కాలమే అయ్యింది
మీ ఆవేదన అర్థమైంది. మీరన్నట్టు ఇలాంటి విషయాల్లో ఇంత రాసినా ఇంకా ఎదో వదిలేసామనీ, సరిగా convey చెయ్యలేకపోయామనీ అనిపిస్తుంది.మన దేశ సన్స్క్రుతి ఇతర దేశాలకంటే భిన్నమైనదనే విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 'స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం ' అని బస్సుల్లో కూడా రాస్తుంటారు చూడండి(గౌరవం ఉన్నా లేకపోయినా). కాలం మారి, స్త్రీలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా , ఊళ్ళేలుతున్నా కూడా మన mindset మారలేదు. స్త్రీలకు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే అని!
ఇంకో పక్క, ఆరేళ్ళ పిల్ల కనపడితే కూడా వదిలి పెట్టని వెధవలు ఉన్న పరిస్థితిలో, మరి తల్లులు, తండ్రులు 'లేడీస్ ఉన్నారు , కొంచెం సర్దుకోండి ' అనక ఏం చేస్తారు? రోజూ సిటీ బస్ లో వెళ్ళే ఆడవాళ్లకు మాత్రమే తెలుస్తుంది కండక్టరుతో సహా ఎంతమంది ఎన్ని రకాల స్పర్శానందం అనుభవిస్తారో!స్త్రీలంటే గౌరవం ఉండి, వారిని తాకినంతనే ఎటువంటి వికారమూ పొందని మంచి పురుషులకు ఇది వర్తించదు(ఈ వాక్యం రెండు సార్లు చదువుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది)
ఒక పక్క మహిళా రిజర్వేషన్ల గొడవ ఇంకా సద్దుమణగక ముందే మీరు ఇంకో వివాదాస్పదాంశం (అవుతుంది చూస్తుండండి) లేవనెత్తారు.
ఇక ఆడవాళ్ళు weeker sex కాబట్టి వాళ్ళకు సంబధించిన పురుషులు రక్షిస్తూ ఉండాలనే భావనకు కారణం మనం మొదటినుంచి అలా అలవాటు చేసాం! కలిసి మెలిసి బతకండి అని నేర్పలేదు. 'వాళ్ల నుండి జాగ్రత్తగా ఉండండి ' అని బోధించాం! సో, మగవారిలో మంచివారున్నా, అందర్నీ ఒకే గాటన కట్టేయడం జరిగింది. పోనీ స్వేచ్చగా ఉండనిద్దాం అంటే...ఇద్దరిలో ఎవరి బుర్రలో పురుగు పుట్టినా మచ్చ పడేది ఆడపిల్లకే!(కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి) అందుకే ఈ 'సర్దుకోండి..ప్లీజ్ ' వేడుకోళ్ళు. అయినా 'అన్నయ్య గారూ ' అని వరసలు కలిపితే తప్ప మాట్లాడలేని స్థితి ఇవాళ లేదు లెండి.మన తల్లిదండ్రుల తరంలో నాన్నగారికోసం ఎవరైనా వస్తే, అమ్మ ఇంట్లో ఉండి పిల్లలతో సమాధానాలు చెప్పించేది. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా లేదు. mind set కొంత మారినా, పూర్తిగా మారడం అదీ ఈ దేశంలో..కష్టమే!
ఈ అంశం మీద కామెంట్లు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కో టపా రాసినా తెగదు చర్చ!
అన్వేషి గారు,అది ప్రాకృతికం.సృష్టి వున్నంత వరకు ఈ భావనలు ఇలాగే వుంటాయి.
మీరు చూసిన సీన్ లో తప్పేంకనపడ్డంలేదు నాకు. ఎవడు పెద్దమనిషో ఎవడు కాదో చూడగానే చెప్పడానికి మనకేమీ దివ్యదృష్టి లేదుకదా? పరాయి మగాడి పక్కన కూర్చోవడనికి ఏ ఆడదానికీ అభ్యంతరం ఉండదు, ఉండేదల్లా మనలాంటి మగాళ్ళకే. ఆటైమ్ లో మనం చూసిన సినిమా లో విలన్ వేషాలు, విన్న న్యూస్ ఐటమ్ లన్నీ ఒక రీలులా తిరిగి తరువాత "అడుసు త్తొక్కనేల, కాలు జారనేల.." అనుకోకుండా ఇది ముందుజాగ్రత్త అంతే. మరోరకంగా ఆలోచిస్తే మనం ఏ చేస్తామో ఇతరులు కూడా అదే చేస్తారనుకునే అలా బిహేవ్ చేస్తాం అంటే ఒకరకంగా అందరిదీ ఒకే మెంటాలిటీ. సాటి మగవాడి చూపుల్ని మనం పాజిటివ్ గా తీసుకోగల్గితే మీరన్న ప్రాబ్లమ్స్ ఏవీ ఉండవు. ఆ సంయమనం రావల్సింది మనకుకూడా.
"స్త్రీ స్పర్శ తగిలితే వికారపు ఆలోచన రాదు" అన్నదాంట్లో పెద్ద నిజంలేదు. స్పర్శ కి చాలా అర్ధాలున్నాయి. పదేళ్ళ క్రితం నేను చదువుకునేటప్పుడు ఒకసారి ఒక అమ్మాయితో కరచాలనం చెయ్యాల్సి వచ్చింది. ఒక హార్డ్ ఫీలింగ్ (ఎక్కడని అడగవద్దు). ఇప్పుడు మా ఆఫీసులో నేను చాలా మంది ఆడాళ్ళతో కరచాలనం చేస్తుంటాను. ఇప్పుడలంటి ఫీలింగే లేదు. మొన్నా మధ్య ఒక ఆడ కొలీగ్ తో పక్కపక్కనే నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా (అనుకుంటున్నాను) నా నడుంచుట్టూ చెయ్యేసింది.??$#$%??. పరాయి ఆడదాని స్పర్శ తగిలినా ఏ ఆలోచనా లేనివాడు వెంఠనే డా|| సమరాన్ని కలవడం మంచిది.
ఆ చిన్నప్పుడు సినిమా హాల్లో బెంచి సెక్షను వరకూ స్త్రీపురుష భాగాలు విడిగా ఉండేవి. ఆ రెంటికీ మధ్య ఒక వెదురు తడిక లాంటిది ఉండేది. కుర్చీ, బాల్కనీ వాళ్ళు "ఫేమిలీ" గా వస్తారనో ఏమో ఈ విభజన ఉండేది కాదు.
సుజాత గారు & చెక్స్ గారు(పేరు మార్చండి సార్! ఇబ్బందిగా ఉంది). మనం మళ్ళీమళ్ళీ ఇలా బ్లాగుల్లో కలవడం బాగుంది.
ఇక విషయానికి వస్తే,ఇది పరిష్కారం చూపగలిగే సమస్య అసలు కాదు.ఎందుకంటే,ఈ సమస్య తీరాలంటే సమాజం సమూలంగా మారిపోవాలి. అది జరిగే పనికాదు కాబట్టి, మన చర్చ దీనికి కారణాలు వెదకడం,మార్పుకు అవకాశాలు ఏర్పడిన రంగాలూ ప్రదేశాలూ పరిచయం చేసే ఉద్దేశంగా సాగిద్దాం(అదీ ఈ ‘బ్లాగుడు’ సాగనిస్తే). ఏమంటారు?
మగజాతి మొత్తానికీ ఈ జాడ్యాన్ని అంటగట్టి వదిలేశారు. అరిటాకు, ముళ్ళు సామెతలాగా ఇప్పటికీ, అందరూ అన్నట్టు మైండ్ సెట్ మారలేదు. అయితే ఈ సమస్య సిటీలలో అంతగాలేదు. టీ షర్ట్, జీన్స్ వేసుకుని మగవాళ్ళని కూడా కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూసే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. వీరి ప్రక్కన కూర్చోవటానికి నాకయితే దడే.
సుజాత గారితో పూర్తిగా ఏకీభవిస్తాను.
మహేష్ గారు,
ప్రాక్రుతికంగా ఉన్న దాన్ని మార్చలేం! కాని,హైదరాబాదు, బెంగుళూరు లాంటి సిటీలలో పరిస్థితి బాగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆడవాళ్లు కేవలం స్టెనో, టైపిస్ట్(పాత సినిమాల్లో చూపించినట్టు) ఉద్యోగాల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎదిగినప్పటినుంచి పరిస్థితి బాగా మారింది. పది పదిహేను మంది ఒకటే cabలో వెళ్ళే పరిస్థితిలో 'సర్దుకోమనే చాన్స్ ఆడపిల్లలు తీసుకోవడం లేదు. మొత్తం సమాజం mindset మారాలంటే అది సాధ్యమయ్యే విషయంలా కనపడట్లేదు.
వీళ్ల పక్క కూచుంటే ఏం, వాళ్ళూ మనలాంటి వాళ్ళేగా అనుకోగలిగే పరిస్థితి ప్రతిచోటా లేదు మరి!స్త్రీ పురుషులు ఒకరినొకరు స్నేహితుల్లా భావించుకోగలిగే పరిస్థితి ఎప్పుడొస్తుందో ఏమిటో!
ఆహా! ఇంత మంది ఈ చర్చలో పాల్గొనడం చూసి కన్నుల పండగ గా ఉంది.ఇక వ్యాఖ్యల విషయానికొస్తే...
@ mahesh kumar:
నా ఉద్దేశం కూడా అదేనండీ. పరిష్కారం మన చేతుల్లో లేదు. analysis మాత్రమే చెయ్యగలం.
@ సూర్యుడు గారు:
బహుశా కౌంటర్లు లేకపోవచ్చు. కానీ మిగతా విషయాలు ఎక్కడైనా ఒకలాగే ఉంటాయండీ. నేను ఉదహరించిన సీను చిత్రమహల్ లోనైనా జరగచ్చు. మల్టిప్లెక్సులోనైనా జరగచ్చు.
@ సుజాత గారు:
మీ విశ్లేషణ బాగుందండీ.
ఏం చెయ్యను. వరసగా ఇలాంటి ఆలోచనలే బుర్రలో పుడుతున్నాయి. ఈ సారి కొద్దిగా lighter tone లో ఉండే టపా రాయాలి.
@kasturimuralikrishna :
అది ప్రాక్రతికం అంటే నేను ఏకీభవించనండి.పాశ్చాత్య దేశాల్లో ఈ "అంటరానితనం" ఏ మూలా కనిపించదు.మరి మన దేశంలో జరిగే అక్రత్యాలు ఆ దేశాల కన్నా తక్కువా??
@ chaks :
మీరే అన్నారు కదండీ ఇప్పుడు చాలామందితో కరచాలనం చేస్తున్నా ఏ ఫీలింగు లేదని... అదే నేనూ చెప్పేది. ఆడదాని స్పర్శ రేర్ అవ్వడం వల్లే ఆ స్పర్శకోసం
molestation లు, బస్సుల్లో తడుముడులు.
అదే చిన్నప్పటి నుంచి ఆ స్పర్శ అలవాటు చేస్తే (ఒక ఆరోగ్యకరమైన రీతిలో) ఆ దేవులాట తగ్గుతుందని నా అభిప్రాయం.
నా లాజిక్కులో చాలా flaws ఉండవచ్చు. కానీ
thats a start.
నిజమేరా.. నాకిప్పటికీ ఎవరైన కొత్తమ్మాయికి షేక్ హాండ్ ఇవ్వాలంటే బెరుకే - Raja
అమ్మలారా, అయ్యలారా, నాణానికి రెండో పార్శ్వం కూడా ఉంది. మగాళ్లని చూపుల్తో తినేసే అమ్మాయిలు మాత్రం లేరా? ఈసారి మీరు సినిమా చూసేటప్పుడు సల్మాన్ ఖానో, హృతిక్ రోషనో చొక్కా విప్పేసే సీనొచ్చినప్పుడు హాల్లో ఉన్న అమ్మాయిల ముఖాలకేసి చూడండి ఒకసారి. అంత మాత్రాన ఆ అమ్మాయిలంతా అదో టైపు అంటామా? అలాగే అందంగా ఉన్న అమ్మాయిని ఓరగా చూసే మగాళ్లందరూ వెధవలేమీ కాదు. హద్దులు మీరనంత వరకూ ఇదో చర్చనీయాంశమే కాదు.
సినిమా హాల్లో పరాయి ఆడ, మగ వాళ్లు పక్క పక్కన కూర్చోకుండా ఉండేది ఇబ్బందిగా ఉండకుండా ఉండాలనే కానీ ఆ మగాడు ఆమెని ఏదో చేసేస్తాడేమోనని కాదు. అలా చేసినంత మాత్రాన స్త్రీలు అణగదొక్కబడుతున్నారనీ, ఇది పురుషాధిక్య సమాజానికి నిదర్శనమనీ వాదించటం సరికాదు. అదే సినిమా హాల్లో తన భర్తో, బాయ్ ఫ్రెండో వేరే అమ్మాయి పక్కన కూర్చోటానికి ఏ అమ్మాయీ ఒప్పుకోదు కదా. అలాంటి సందర్భం వస్తే ఆమె ఆ అమ్మాయి పక్కన కూర్చుని భర్త/బాయ్ ఫ్రెండ్ ని మరో పక్క కూర్చోబెడుతుంది. మరి ఇది మహిళాధిక్య సమాజానికి నిదర్శనమా?
@ అబ్రకదబ్ర
ఓరకంట చూడటానికీ, తినేసేలా చూడటానికీ తేడా ఉంది కదండీ. పక్కన ఉన్న నేనే అంత ఇబ్బందిగా ఫీలయ్యానే. ఇక ఆ అమ్మాయికి ఎల్లా అనిపిస్తుందో ఆలోచించండి.
అయినా ఇక్కడ చర్చ తప్పొప్పుల గురించి కానే కాదు.మన సమాజంలో అందరూ పాటించే ఒక వింత అంటరానితనం గురించి అందరి దృష్టికీ తీసుకురావాలన్న ఉద్దేశం అంతే...
foreign countries లో అంటరానితనం లేదు అని కాదు ... ఇక్కడ అమ్మాయిని ముట్టుకోవాలి అంటే ఆ అమ్మాయి అంగీకారం వుండాలి ... లేదంటే శ్రీ కృష్ణ జన్మ స్థానమే ... కానీ మన దేశం లో అలా కాదు ... సెక్యూరిటీ తక్కువ .. ప్రతి చోట cops వుండరు .. కాబట్టి అమయిల్ని protective way లోనే treat చేస్తున్నాం ... ఏదన్నా చిన్న విషయానికి కూడా sue chesestharu కాబట్టి ... అమ్మాయిల డ్రెస్ సెన్స్ ఇక్కడ security కి తగ్గట్టు free style లో వుంటుంది
Post a Comment