అమ్మాయిలతో నాకదే ఇబ్బంది. తెలిసి అంటారో, తెలీక అంటారో తెలీదు గానీ గబుక్కున అనేస్తారు. అవతల వాడు ఏమనుకుంటాడో అని అస్సలు ఆలోచించరు. మేటరు చెప్పకుండా ఏంటీ సోది అంటారా? మేటరు ఎక్కువ లేనప్పుడు ఇల్లాగే పోస్టు నింపాలి. ఇక నా బాధ ఏంటంటే....
****************************
నేను,రవి గాడు కలిసి రోడ్డు మీద వెళ్తున్నాం. నాలుగడుగులేసామో లేదో ఎవరో అమ్మాయి వాణ్ణి చూసి చెయ్యి ఊపింది. మనోడూ ఊపాడు. ఇహ సొల్లు మొదలైంది. ఇదే నాకు వాడిని చూస్తే మండేది. ఊరందరూ ఫ్రెండ్సే యదవకి. అందులో సమస్య లేదు. సమస్యల్లా ఆ ఫ్రెండ్సులో తొంభై శాతం అమ్మాయిలే. ఎప్పుడు బయటకి వెళ్ళినా సందుకో అమ్మాయి తగలడం, పక్కన నన్ను దిష్టి బొమ్మలా నిలబెట్టి వాళ్ళిద్దరూ సొల్లేసుకోవడం.మనం లేడీసు డిపార్టుమెంటులో కొద్దిగా వీకులెండి. పాపం. మా వాడు నన్ను పరిచయం చేసేవాడు కొత్తలో.ఆ అమ్మాయి "అయితే ఏంటంట" అన్న టైపులో వాడికేసి చూసి, మర్యాదకి నా వైపు ఓ సారి నవ్వి మళ్ళీ వాడితో సొల్లు మొదలెట్టేది. ఇహ లాభం లేదని లైటు తీస్కున్నాడు. అంత anti girl repellent నా దగ్గర ఏంఉందో ఇప్పటికీ అర్ధం కాదు. ఆ విషయం పక్కన బెట్టి ప్రస్తుతానికి వద్దాం.
ఆ అమ్మాయి సడెన్ గా నన్ను చూపించి "తనూ..." అంది ప్రశ్నార్ధకంగా. ఇహ చూస్కోండి. నాకైతే అక్కడే వీణ స్టెప్పు వెయ్యాలనిపించింది. ఒక అమ్మాయి నా existance ని acknowledge చెయ్యడమా!
ఎన్నాళ్ళో వేచిన ఉదయం..... ఈ నాడే ఎదురవుతుంటే.... అంటూ పాట పాడేసుకున్నాను. ఇంకా సిట్యుయేషన్ కి సరిపొయే పాటలేమున్నాయని ఆలోచిస్తుంటే రవిగాడు చెప్పాడు. " తను సందీప్ అని. నా క్లాస్ మేట్"
ఈ లోగా నేను తర్వాత పాటకి వచ్చాను.
" భలే మంచి రోజు. పసందైన రోజు.. వసంతాలు కురిసే..."
"నిజ్జంగా..."
ఎక్కడో అపసృతి వినిపించింది. ఆ అమ్మాయి బోలెడంత అమితాస్చర్యపడిపోయి లేచి
"అలా అస్సలు కనిపించడం లేదు తెలుసా! చిన్న పిల్లాడిలా ఉన్నాడు. నీ తమ్ముడేమో అనుకున్నా!"
ఇహ అంతే! నాకింకే కనిపించలేదు. వినిపించలేదు. హిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వా. ఆ ప్రహసనం అలా ముగిసింది.
**************************************
ఒకవేళ మీరు ముప్పైల్లో ఉంటే పై కామెంటు చెవులకింపుగా అనిపించవచ్చు. కానీ మీరు ఇరవై రెండేళ్ల కుర్రాడై, ఒక అమ్మాయి మిమ్మల్ని చిన్నపిల్లాడిలా చూస్తోందంటే అంత కంటే hurting thing ఇంకోటి ఉండదు. అదీ మొదటి పరిచయంలో....
ఇప్పుడు చెప్పండి. ఒక అబ్బాయికి తన స్నేహితురాలు ఇంకో స్నేహితురాలిని పరిచయం చేసిందే అనుకోండి. ఆ అబ్బాయి ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడు?? ఒకపక్క అతిగా మాట్లాడకుండా, మరోపక్క పూర్తిగా ఇగ్నోర్ చెయ్యకుండా
మేనేజ్ చేస్తాడు. or atleast, నేను చూసిన ప్రతి సందర్భంలోనూ అలానే జరిగింది.
మరి అమ్మాయిల విషయంలో ఇలా ఎందుకు ఉండదు??
ఒక్క సంఘటన కే నెను జనరలైజ్ చేసేస్తున్నానని మీకు అనిపించవచ్చు. believe me. thats only one of the incidents!
*******************************
ఇల్లాంటి ఘోరావమానమే ఇంకో ఏడాది కి జరిగింది. నేనూ, ప్రవీణూ ఏదో ఎస్సైన్ మెంటు మీద పని చేస్తున్నాం. అంతలో వాడి సవాలక్ష ఆడ స్నేహితుల్లో ఒక స్నేహితురాలు ఫోన్ చేసింది.
( ఇక్కడ నాకొక డౌటు. why is that ur best friend always has a lot of success with girls while all you can manage is a weak smile and a bear hello with them??)
as usual, మనోడు సొల్లు మొదలెట్టాడు. చెయ్యాల్సిన పని బండెడుంది. నాకు చిరాకేసి వాడిని ఫోను పెట్టమన్నాను.
నన్ను కూల్ చెయ్యడానికో ఏంటో,
"హే! నా ఫ్రెండుతో మాట్లాడు." అని ఫోను నాకిచ్చాడు.
మనమేం మాట్లాడతాం. ఫోను తీసుకుని హలో అన్నాను. ఆ అమ్మాయి కూడా హల్లో అంది.
కొంచం పని ఉందండి. మా వాణ్ణి కాస్సేపు వదలచ్చు కదా! అన్నా.
అటుపక్కనుంచి తెరలు తెరలుగా నవ్వు.
అంత జోకేమేసానబ్బా! అంతలా నవ్వుతోంది అనుకున్నా!
ఆ తర్వాత వచ్చింది సమాధానం.
" ఏం.. హిహి.. లేదండి. హిహి.. మీ... హిహి... వాయిస్ చాలా.. హిహి... విచిత్రంగా... హిహి"
నా రియాక్షను మీరే ఊహించుకోగలరు.
***************************
నా గొంతు కీచుగా ఉంటుంది నిజమే. కానీ మొదటి పరిచయంలోనే అలా అనెయ్యడమే??
అదే నేను ఓ అమ్మాయితో తొలి పరిచయంలో
"హి హి. మీ జుట్టు భలే ఉందండీ కొబ్బరి పీచులా" అంటే ఎలా ఉంటుంది.??
ఏదైమైనా ఇల్లాంటి సంఘటనలు నన్ను రాటు తేల్చాయి. తరువాత మా క్లాసులో అమ్మాయిలందరూ ఏకగ్రీవంగా నేను చిన్నపిల్లాడిలా ఉంటాననీ, నేను వాళ్ల తమ్ముడిలా అనిపిస్తానని డిక్లేరు చేసినప్పుడు కూడా గుండె పగలకుండా బతకగలిగానంటే ఇల్లాంటి అనుభవాలే కారణం.
అబ్బాయిల మధ్య ఎంత నికృష్టపు భాష మాట్లాడే అబ్బాయి ఐనా అమ్మాయిల ముందు చాలా decent language
వాడతాడే!మరి అమ్మాయిలు ఎందుకు reciprocate చెయ్యరు? నేను మా క్లాసు అమ్మాయిల దగ్గరకు వెళ్ళి మీరు చాలా బావున్నారు. నాకు నా లవరులా అనిపిస్తున్నారు అంటే ఎలా ఉంటుంది?? ఇది పైకి absurd గా అనిపించచ్చు.
కానీ ఆ ఫీలింగు subjective కదా! అమ్మాయిలు ఆ మాట అంటే ఎలా ఫీల్ అవుతారో, ఒక అబ్బాయిని తమ్ముడూ అన్నా అలాగే ఫీల్ అవుతాడని common sense ఉండక్కర్లేద్దా??
ఏంటో... పోస్టు కామెడీగా రాద్దామని మొదలెట్టాను. సెకండ్ హాఫు సీరియస్ అయిపోయింది. బొమ్మ ఆడటం కష్టమే!
13 comments:
వాళ్లని మీరే పట్టించుకోవాలి. వాళ్లెప్పుడూ పట్టించుకోనట్లే నటిస్తారు. తర్వాత పిచ్చి జోకులెయ్యాలి - ఎంత నవ్వురాకపోయినా సరే. వాళ్లు పగలబడి నవ్వుతారు. మీలాగా రిజర్వుడుగా ఉంటే అమ్మాయిలు మీకేసి చూడరు. తర్వాత, వాళ్లెంత బాగున్నారో అనే విషయం పదే పదే గుర్తు చేస్తుండాలి. అస్సలు మొహమాట పడొద్దు ఈ విషయంలో. 'నువ్వు భలే ఉన్నావు' అంటే మీరు అబద్ధం చెబుతున్నారనుకునే అమ్మాయెవరూ ఉండదు. సో, అలా చేసి చూడండి. అమ్మాయిలెందుకు మాట్లాడరో చూద్దాం మీతో. మరోటి, అమ్మాయెవరన్నా మీతో తన బాధలు చెప్పుకుంటే పొరపాటున కూడా ఆమె సమస్యలకి పరిష్కారాలు చూపించొద్దు. ఆమెకి కావలసింది మీ సింపతీ మాత్రమే - సొల్యూషన్ కాదు. కేవలం సానుభూతి కురిపించండి. ఆమె కరిగిపోతుంది.
డబ్బులిచ్చి ఆడిద్దాం :)
anti girl repellent - ఈ మాట చిత్రంగా వుంది.
బొమ్మ ఆడే సంగతి పక్కన పెడితే,నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి సందీప్.కాని మరీ నువ్వు అమ్మాయిలంటే నెగెటివ్ ఫీలింగ్ పెంచుకోకు.అందరు ఒకేలాగ ఉండరు కదా!
హ్హి హ్హి హ్హి :)
:-)
sorry,meeru rasndi chedvithe, mallli sorry ani matrame rayagaluguthunnanu.
okappati amai.
@anonymous:
మాష్టారూ... మీరు చెప్పినవన్నీ పాటించడం కంటే cat,gate,gre,gmat కలిపి కంబైన్డుగా రాయడం సులువేమో! మనకంత టాలెంటు లేదండీ...
అందుకే ఇలా బ్లాగులోకంలో బతుకుతున్నాను.
@ రానారె
నిజమేనండీ. girl repellent అంటే సరిపోయేది. ఏదో ఆ ఎమోషన్లో అలా రాసేసాను.
@ క్రాంతి
మరేనండి.ఈ బ్లాగు చదివి ఒక్క అమ్మాయి ఐనా ఇష్టం వచ్చినట్టు తమ్ముడు, అన్నయ్య వరసలను వాడటం తగ్గిస్తే అదే చాలు నాకు.
నెగిటివ్ ఫీలింగ్ అంటారా! అంత లేదండి. మాట్లాడడం రాకపోతేనేం... బాగా దూరం నుంచి చూసి ఆనందిస్తాం.
@ RSG
అంతలా నవ్వకు బ్రదరూ. అందరికీ నీలా బుగ్గలోడు అని పిలిపించుకునే అదృష్టం ఉండదు. లేడీసు ఫాలోయింగూ ఉండదు.
@ సుజాత
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.కాకపోతే చిన్న సవరణ. డేట్ కి వెళ్ళినప్పుడు ఫుల్లుగా తినడమే కాకుండా
బిల్లు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది.
(ఇందుకే నాకు అమ్మాయిలు పడరనుకుంటా. నా అంత unromantic fellow ని నేనెక్కడా చూడలేదు)
@ కొత్తపాళీ
:-( :-(
@ అనానిమస్సు అమ్మాయి
ఈవిడెవరో ఖచ్చితంగా నా అక్కల లిస్టులో ఉండి ఉంటుంది. అలా ఐన పక్షంలో ఇదిగో నా ఫ్రీ క్లాసు.
అమ్మాయీ.. సోదర భావం కూడా ఒక రకమైన ప్రేమే. దాన్ని బలవంతంగా రుద్దితే ఎలా ఉంటుందో ఒక్కసారి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ మాట రాఖీ వస్తే చాలు, తనకి అనుమానం ఉన్న ప్రతీ అబ్బాయి మీదకీ రాఖీలతో దండెత్తే అమ్మాయిలకీ వర్తిస్తుంది.
అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు.పూరీ జగన్నాధ్ లా వివాదాస్పద టైటిల్ పెట్టి రప్పించారు మీ ధియేటర్ కి.సినిమా సూపరు.అబ్బాయిలకి అమ్మాయిలని ఇంప్రెస్ చెయ్యాలనే తహతహ ఎక్కువ.అమ్మాయిలకి ఆ ఉద్దేస్యం వచ్చేసరికే చుట్టూ భజన చేస్తూ బోలెడు అబ్బాయిలు.ఇంక ఇంప్రెస్ చెయ్యాల్సిన అవసరం ఏముంది.వదిలించుకోవాల్సిన వాళ్ళతో అలాగే మాట్లాడతాము మరి.:)
అయినా నవ్వుతూ,మంచిగా మాట్లాడితే మీరేగా అంటారు అమ్మాయి ఎక్కువ చేస్తుంది,అదో టైపు ,మగాళ్ళంటే పడి చచ్చిపోద్దని.
తమ్ముడు,అన్నయ్య అని పిలిచేవాళ్ళు చాలా మంది ఉంటారుగానీ,మీరు చెప్పినట్టుగా మొహం మీదే కీచుగొంతు,బండోడు అని అనేవాళ్ళు తక్కువనుకుంటున్నాను.[పక్కకెళ్ళి చాలా అనుకుంటాము.అది వేరే విషయం]
పాపం మీకు అవకూడని అనుభవాలే అయ్యాయి.
ఇక్కడ జనాల సలహాలు చూస్తుంటే అవి పాటించడం కన్నా అమ్మాయిలు మాట్లాడకపోవడమే బెటరనిపిస్తుంది.
రాధికగారన్నది కరెక్ట్... ఒకమ్మాయి ఏమాత్రం అందంగా ఉన్నా...తనని ఇంప్రెస్ చేద్దామని ప్రయత్నించేవాళ్ళే అందరూ... They get a lot of attention from Opposite sex..
వీళ్ళందరినీ హాండిల్ చేసేసరికి రాటుతేలిపోతారు...
అబ్బాయిల సంగతి అలాక్కాదే... We have to fight to get attention... :)
:)
Post a Comment