Sunday, May 3, 2009

పాలు-నీళ్ళు

కొన్ని పదాలు ఎందుకు వాడుకలో ఉన్నాయో, అందరూ వాటిని ఎందుకు వాడతారో నాకస్సలు అర్ధం కాదు.ఉదాహరణకి ఒక జంట చూడటానికి బాగుంటే చిలకా గోరింకల్లా ఉన్నారంటారు.అలాగే ఆలుమగలు పాలు నీళ్ళల్లా కలిసిపోవాలని ఆశ్శీర్వదిస్తారు.

  మొదటి పోలిక ఎంత Ridiculous గా ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఒకవేళ దానికి Reasoning ఏమన్నా ఉంటే చెప్పండి.తెలుసుకుంటాను.

ఇక పాలు - నీళ్ళ గురించి.....

 పాలు,నీళ్ళ combination లో అంత గొప్పతనం ఏం ఉందో నాకు తెలియదు.పాలల్లో నీళ్ళు కలపటం వల్ల పాల నాణ్యత పాడవుతుంది. పైగా నీటికి అస్థిత్వం పోతుంది. విడిగా పాలు,నీళ్ళు వేటి ప్రాధాన్యత వాటికి ఉన్నా, ఒకసారి కలిసాక పాల Dominance ఎక్కువ.Hmm.. మన సమాజంలో కూడా పెళ్ళైతే స్త్రీ పరిస్థితి నీళ్ళలాంటిదని అన్యాపదేశంగా చెప్పడం ఆ పోలిక ఉద్దేశమేమో!!

 ఆలోచిస్తే, ఈ విషయంలో అన్నిటి కన్నా మంచి పోలిక "సంగీత సాహిత్యాలు" అనిపిస్తుంది.

సంగీతం సాహిత్యం లేకుండా బతకకలదు.

సాహిత్యం కూడా సంగీతం లేకుండా బతకకలదు.

కానీ ఆ రెండూ కలిసినపుడు వచ్చే ఆ combination-ఒట్టి సంగీతం,లేదా సాహిత్యం కంటే ఎన్నో రెట్లు బాగుంటుంది.

 what i am trying to say is - They compliment each other. or rather,they complete each other.

సంగీతం లేని సాహిత్యం,సాహిత్యం లేని సంగీతం ఏదో కోల్పోయినట్టుంటాయి( अधूरा).Atleast, నాకైతే అలానే అనిపిస్తుంది. ofcourse, ఇక్కడ నా దృష్టిలో సాహిత్యం అంటే వచనం కాదు,కవిత్వం....

అలాగని అవి ఒకదానిని ఒకటి Dominate చేసిన సందర్భాలు రావని కాదు.వచ్చినా కొన్నిసార్లు సంగీతానికి ప్రాధాన్యత దొరికితే,కొన్నిసార్లు సాహిత్యం పేరు తెచ్చుకుంటుంది.

మరి చెప్పండి.నిజంగా ఆలుమగలని దీవించాలంటే ,సంగీత సాహిత్యాల కన్నా మంచి పోలిక ఏమిటో!!!!

1 comment:

పరిమళం said...

మీరే చెప్పారు ! సంగీతం , సాహిత్యం విడదీయొచ్చని !
కానీ పాలూ నీళ్ళని ఒకసారి కలిపాక వేరు చేయలేం ...నాకుతెలిసి భార్యా భర్తలు అలా ఉండాలని ఆ పదాల వాడుక అనుకుంటా !ఎవరు పాలు ..ఎవరు నీళ్లు అన్నది వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది :) :)