Friday, May 2, 2008

ధర్మ సందేహాలు

నాకు ఈ మధ్య కాలం లో వచ్చిన ధర్మ సందేహాలివి....

1. గంజాయి లాంటి మత్తు పధార్ధాలని ప్రభుత్వాలు ఎందుకు illegal చేస్తాయి? ప్రజల ఆరోగ్యం కోసమా?? అలా ఐతే

మరి మద్యం దుకాణాలను సర్కారు వారే ఎందుకు నడుపుతారు??? అవి కూడా ఆయుష్షు తగ్గించేవే కదా???

మద్యం తాగడం తప్పని నా ఉద్దేశం కాదు. అసలు పక్కవాడికి న్యూసెన్స్ కానంతవరకు నువ్వేం చేసినా సమస్య కాదని

నా ఫీలింగు. నా డౌటల్లా సిగరెట్టు పేకెట్ల మీద గుద్దినట్టు గంజాయి పేకేట్ల మీద కుడా "highly injurious to health.

government recommends you not to consume it" అన్న టైపులో ఒక వార్నింగు గుద్దేసి మార్కెట్లోకి

వదిలెయ్యచ్చు కదా?????

After all, If it can happen with cigarettes, why can't it happen for drugs???

నేనే అలవాటునీ సమర్ధించటం లేదు... తెగనాడటం లేదు. ఎవరి life వాళ్ళిష్టం. ఇలా ఎందుకు జరగడం లేదు అని

అడుగుతున్నానంతే....

2. మొన్నీ మధ్య ఒక IPL ళో అసభ్య ప్రదర్శనలను ఖండిస్తూ mumbai కి చెందిన ఒక మంత్రివర్యులు " స్త్రీ లని

పూజించే దేశం మనది. ఇలాంటివన్నీ ఎలా అనుమతిస్తాం?? " అన్నారట!

అమాఖ్యా! మన దేశం లో స్త్రీలకు పూజలు జరుగుతున్నాయన్న విషయం తెలిసి చాలా ఆనందమేసింది.

నేనిప్పటిదాకా మన దేశం లో స్త్రీలు దారుణంగా abuse,molestations కి గురి అవుతున్నారని భ్రమలో ఉన్నాను.

కళ్ళు తెరిపించారు. మరి ఈ దేశంలో ఊరికొక రెడ్ లైట్ ఏరియా ఎందుకున్నట్టు?? గంటకొక రేపు ఎందుకు

జరుగుతున్నట్టు??

మీరు bollywood సినిమాలు చూస్తారా?? ఆ డాన్సర్ల దుస్తులు మన టాప్ హీరోయిన్ల దుస్తుల కన్నా కురచగా

ఉన్నాయా??? మరి ఆ సినిమాల అవార్డు ఫంక్షన్లకి హాజరై వారితో కలిసి పత్రికలకు ఫోజులిస్తారే? ఆ సినిమాలని

నిషేదించచ్చు కదా??

నేను exposing ని వ్యతిరేకించట్లేదు. cheer leaders ని support చెయ్యట్లేదు. ఆయన గారి లాజిక్ చూసి

మండిందంతే...!

౩. తిరుపతి కెళ్లి రికమండేషన్ లెటర్లు చూపించీ, అక్కడ ఉద్యోగుల చెయ్యి తడిపీ, నానా అడ్డ దారుల్లో దర్శనం

చేసుకుంటామే.... అసలు కొద్దిగానైనా మనస్సాక్షి గగ్గోలు పెట్టదా?? అసలు దేవుడిని చూడటానికి ఒక మంత్రి

recommendation చెయ్యటమేంటి??

సందు చివర ఉన్న దేవుడి కన్నా తిరుపతి లో ఉన్న దేవుడు ఎలా గొప్ప అవుతాడు??

(I am expecting a lot of curses through comments due to this part!)


4. పురుషులతో స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి, పురుషులు స్త్రీలు సమానమే అని వాదించేవారు

at the same time స్త్రీలకు రిజర్వేషన్లు కావాలని ఎలా డిమాండ్ చేస్తారు?? రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు ఏదో ఒక విధంగా

backward అని, అలా కాకపోయినా atleast సమానం కాదు అని ఒప్పుకున్నట్టేగా???

5. ప్రతి పత్రికలోనూ, టీవీ షోల్లోనూ స్త్రీల కోసం ప్రత్యేక వ్యాసాలుంటాయ్, ప్రోగ్రాంలు ఉంటాయి. ఈ రోజే జ్యోతిగారు

మహిళా బ్లాగరుల కోసం ప్రత్యేక చర్చా వేదిక టైపులో ఏదో ఏర్పాటు చెయ్యబోతున్నట్టు బ్లాగారు.

మరి ఇలా పురుషులకి ఎందుకు స్పెషల్ గా సప్లిమెంట్లు, షో లు ఉండవు..??? మార్కెట్ లేదనా?? స్త్రీ జనాభా కన్నా

పురుష జనాభాయే ఎక్కువ కదా?? పురుషులకి appeal చేసే వ్యాసాలతో for men సప్లిమెంట్లు ఎందుకు రావు??
****************************************

నా లాజిక్కులు మీకు సిల్లీగా అనిపించచ్చు. ఇవి నా సందేహాలే గానీ అభిప్రాయాలు కావు. తప్పనిపిస్తే ఎందుకో

చెప్పండి. తెలుసుకుంటాను..

6 comments:

సూర్యుడు said...

సూపర్, కానీ నాకూ సమాధానాలు తెలియవు ;)

~సూర్యుడు :-)

చేతన_Chetana said...

నా దగ్గెర మీ ప్రశ్నలకు సమాధానాలు లేవు, ఎందుకంటే నావి కూడా అవే సందేహాలు.. ముఖ్యంగా రిజర్వేషన్ల (మహిళా రిజర్వేషన్లే కాదు, యే రిజర్వేషనైనా) విషయంలో. తక్కువ కాదు, సమానం అంటూనే నేను అందరితో పోటీ చేయ(లే)ను నాకు స్పెషల్‌గా ఇచ్చేయమనటమేమిటీ? self contradictory కాదా ఆ స్టేట్మెంటు?

San .D said...

@సూర్యుడు గారు
ధన్యవాదాలు.

@చేతన
బతికించారండీ బాబూ! లేడీసు అంతా యుద్దం ప్రకటిస్తారేమోనని భయపడి చచ్చాను. అలాంటిది
సపోర్టే వచ్చిందంటే... ఇహ చాలు.
ఈ ఊపులో ఇంకో రెండు టపాలు కుమ్మేస్తాను.

జ్యోతి said...

సందీప్ గారు,

సమాధానం లేని ప్రశ్నలకు ఎన్ని బ్లాగితే ఏమి లాభం? కొన్నింటిని అలా వదిలేయాలంతే??

చేతన_Chetana said...

నేను మీకు సపోర్టు ఇవ్వటం అటుంచండి, కొన్నాళ్ళ క్రితం ఒక బ్లాగులో ఇలాగే రిజర్వేషన్లు అవసరంలేదు, ఉన్నదంటున్న సమస్యని అవి ఏ విధంగానూ పరిష్కరించలేవని అంటే నేనసలు వివక్ష అనేది చూడలేదని, అమ్మాయిలు 'సాధారణంగా' ఎదుర్కొనే కష్టాలేవీ నేను ఎదుర్కోలేదనీ నా గురించి ఏమీ తెలియకుండానే తిరిగి నన్ను జడ్జ్ చేసేసారు అమ్మాయిల తరపున వకాల్తా పుచ్చుకున్న బ్లాగరి. :-) amusing. ఇంతకీ చెప్పేదేంటంటే మీరు యుద్ధానికి సిద్ధపడే ఉండండి, ఎందుకంటే అమ్మాయిలు కాకపోయిన ఈ విషయమ్మీద అబ్బాయిలు ప్రకటించవచ్చు యుద్ధం. :-)

Anonymous said...

ha ha chala manchi praSnalu.
stree purushulu samaanam kabaTTi, iruvurikii samaana hakkulu unDaali kaabaTTi streelaku reservations unDaali, female blog groups unDaali :)