Sunday, July 13, 2008

టిప్పు సుల్తానులు

మొన్నీ మధ్య స్నేహితులతో కలసి హోటలుకి వెళ్ళాను.ఫుడ్దు మీద దండయాత్ర జరిపాక బిల్లు చేతికి వచ్చింది.అదేంటో లక్కీగా కరెక్టు ఎమౌంటు
నా దగ్గర ఉంది. సర్లే కదా అని అక్కడ పెట్టేసి బయటకి నడిచాను.మా ప్రెండ్సు కేసి చూద్దును కదా... నేనేదో అడుక్కుంటున్న బిచ్చగాడి జోలెలోంచి
చిల్లర కొట్టేసినట్టు నా కేసి చూస్తున్నారు.
"ఏమైందిరా.." అని అడిగాను.
"అదేంట్రా... టిప్పివకుండా వచ్చేసావు?" అని అడిగాడు ఒకడు.
"కరెక్టు మనీ ఉంది కదా అని..."

"అక్కడ ఆ వెయిటరు మన కేసి ఎంత అసహ్యంగా చూసాడో తెలుసా..?" ఇంకొకడు అందుకున్నాడు.

నాకు విషయం అర్ధమైంది.

"అంటే వాడు తిట్టుకుంటాడేమో అని మనం టిప్పు ఇవ్వాలా..?"

"అలా కాదురా..మనకి బాగా సెర్వ్ చేసాడు కదా..!" ఇంకోడు చెప్పబోయాడు.

"అది వాడి ఉద్యోగం కదా..."

"జనరల్ గా అందరూ ఇస్తాం కదరా...?"

"అదే.. ఎందుకిస్తామో చెప్పు?"

ఇంకోడి కి మండింది."ఎహే.తొక్కలో పది రూపాయిలు టిప్పు గురించి ఇంత వాదిస్తావేంటెహె పీనాసోడిలాగా..?"

"ఇక్కడ మేటరు మనీ కాదురా... అసలు ఎందుకిస్తామో రీజను"
"బాబూ నక్సలైటూ! మళ్ళీ నీ ఆదర్శాలు మొదలెట్టకు. పద పోదాం" అంటూ ఇంకోడు కట్ చేసాడు. అక్కడితో ఆ ప్రహసనం ముగిసింది.

అదిగో.. అక్కడ చెప్పాలనుకున్న మాటలే ఇక్కడ బ్లాగుతున్నాను...

ప్రపంచంలో ఏ ఉద్యోగంలోనైనా మనం చేసే పనికి మన యజమాని మనకి జీతం ఇస్తాడు. మన పని బాగుంటే బోనస్సులూ,ఇంక్రిమెంటులూ అన్నీ యజమానే
చూసుకుంటాడు.అలా కాక మన పని మనం చెయ్యడానికి కస్టమరు నుండి డబ్బు డిమాండు చేస్తే అది లంచం అవుతుంది. at least, నాకు తెలిసి లంచం definition అదే...
మరి వెయిటర్లకి మాత్రం ఈ రూలు ఎందుకు మినహాయింపో నాకు అర్ధం కాదు.మనకి సెర్వ్ చెయ్యడం అతని ఉద్యోగం.అదే చేసాడు. నేను బిల్లు కడతాను.
మరి అదనంగా అతడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి??

but, thats not the worst part...అలా సరైన మొత్తంలో టిప్పు ఇవ్వని వాళ్ళందరూ పిసినారులని ఎందుకు అనుకోవాలి?
టిప్పు ఇవ్వకుండా వచ్చిన ప్రతీ సారీ ఆ హోటల్లోంచి స్పూనులు,ఫోర్కులు ఎత్తుకొచ్చినట్టు ఎందుకు గిల్టీ ఫీలవ్వాలి?
why this habit is so widely accepted around the world that whomever
don't follow it are labelled as queers?

మీలో ఇప్పటికే ఏంటిరా వీడి గోల ఇంత చిన్న విషయానికి అనుకుంటూ ఉండవచ్చు.కానీ సీరియస్ గా నాకు అర్ధం కాని విషయమిది.మీరు ఎప్పుడు హొటలుకి
వెళ్ళినా టిప్పు ఇస్తూనే ఉంటారు. అసలు ఎందుకు ఇస్తున్నారో ఆలోచించారా?
నాకు తట్టిన కారణాలివి...

1.అందరూ ఇస్తున్నారు కనుక.
2.చిన్నప్పటి నుండి అలవాటవడం వలన.
3.ఇవ్వక పోతే అంతా పిసినారి అనుకుంటారన్న భయం వల్ల .
4.వెయిటరు సర్వీసుతో satisfy అవ్వడం వలన.

కానీ ఎంత ఆలోచించినా అన్ని కారణాలకూ మూల కారణం మనం చిన్నప్పటి నుండి పెరిగిన కండిషనింగ్ వల్లనేమో అనిపిస్తుంది.కానీ అసలు ఈ అలవాటు ఎక్కడ ఎలా మొదలయింది అన్నది నాకు అంతు చిక్కని ప్రశ్న.

Believe me,టిప్పు ఇవ్వడం పెద్ద సమస్య అని నేను అనటం లేదు.కానీ tipping is no longer a gesture
of generosity now. its compulsory!టిప్పు ఇవ్వకపోవడం పెద్ద social stigma అయిపోయింది.
అదే ఎందుకు అని అడుగుతున్నాను.

ఇది ’చిల్లర’ సమస్య గా మీకనిపించవచ్చు . కానీ దీని వెనకాల ఉన్న లాజిక్కు ఆలోచించీ చించీ నాకు బుర్ర పిచ్చెక్కుతోంది.

మీలో ఎవరైనా దీనికి సంతృప్తికరమైన సమాధానం చెప్పగలరా?

7 comments:

teresa said...

From what I heard, the waiters get very small sum as salary, some times less than minimum wages!! The amount on the bill goes straight to the restaurant and the waiter did not a penny for the services he offered to you.
నేను టిప్పిఛ్ఛేది మీరు చెప్పిన 4 కారణాల వల్లా కాదు. ఆ స్టూడెంట్ sense of responsibility ని ప్రొత్సహించాలనీ,dignity of labor మీదున్న గౌరవం తోనూ 15-20% ఇస్తానెప్పుడూ. ఇంకో విషయం- tip ఎప్పుడూ cash రూపేణా ఇస్తేనే అతనికి చెందుతుంది. కార్డ్ పైన చార్జ్ చేస్తే టాక్స్ పోను అతనికి చెందేది peanuts!

Sujata M said...

1) Tip is not a universal phenomenon. In some parts of the world, there is nothing like tipping. Its a widely accepted gesture of saying thank you to the person who waited on you.

2) Tip is not a bad thing. However it is optional. Its purely one's personal choise. The waiter will not be saying that you are not welcome there any way!

Cheer up. Nevermind. If you dont like it.. leave it. Dont take it to heart.

Kathi Mahesh Kumar said...

మీరన్నట్లు ఇది చిల్లర సమస్య కాదు. ఆలోచింపదగిందే!

ఇదెలా మొదలయ్యిందో తెలీదుగానీ,చట్టప్రకారం ‘టిప్’ ఇవ్వడం అనేది తప్పనిసరైతేకాదు.ఇంకా ప్రభుత్వ ఉద్యొగులకి టిప్ ఇస్తే అది లంచం కింద చట్టపరంగా నేరం అయ్యే ప్రమాదం ఉంది.

ఇదొక సామాజిక విధానం.ముఖ్యంగా సర్విస్/హాస్పిటాలిటీ సెక్టర్ లో మాత్రమే, మన సంతృప్తిని తెలియజెప్పడానికి ‘టిప్’ని విధానాన్ని వాడతాం.ముఖ్యంగా సర్విస్/సేవ బాగున్నప్పుడు అది అందించిన వ్యక్తికి కొంత చిల్లర ఇవ్వడం ద్వారా మన సంతృప్తిని కనబరచడం గౌరవప్రదంగా ఉంటుంది.అది మంచి సంస్కృతికూడా అనిపిస్తుంది.

Unknown said...

అవును టిప్ అనేది సంతోషంగా ఇవ్వడం అనే స్టేజీ దాటి మీరు చెప్పిన కారణాలకి చేరుకుంది.
అసలు హోటళ్ళలో, రెస్టారెంట్లలో వారి జన్మహక్కే అన్నట్టు ప్రవర్తిస్తుంటారు కూడా కొంతమంది.

ఇంకొన్ని దేశాలలో అయితే ఇంత పర్సెంటు అని తప్పక ఇవ్వాల్సిందే. అదేంటో అర్థం కాదు. అలాంటప్పుడు ఐటెంస్ బిల్లులోనే దాన్ని జోడించవచ్చు కదా ?

Anonymous said...

In some Hotels, the tips received from all Customers are pooled and distributed equally to all staff (serving, non serving such as cooks, chefs, masters, cleaners etc.). The emoluments of these waiters are fixed (by the market) taking into account a reasonable income thru tips. If the Hotel pays the Servers befittingly and the Customers tip them generously - don't they become rich in no time?

Well, as about the practice of tipping, don't you pay Dasara Maamul to Post Man, Ganpat Tips to Street Urchins, for moving a fool scap paper from one table to the next in a Taluq/ Mandal Office.

The list is end less. Tipping a server is a trivial issue. In "Shahenshah" (Hindi film) Amrish Puri says -"Tip a Server in advance and rest assured for a top class attention". Namasthe.

Anonymous said...

ఏమో బాబు మా స్టేట్(louisiana) లో అడగకుండానే 15% gratuity అని బిల్ లో వేసేసుకున్నాడు . అదేంట్రా gratuity అంటే నేను ఇవ్వాలి కదా వాడి ఇష్టం ఏంటి అని నాకు కోపం వచ్చింది . కానీ అంటే ఏదో పీనాసోడికిలగా చూస్తారు అని ఊరుకున్నా

చేతన_Chetana said...

USలో రెస్టారెంట్లలో, లేదా టూర్‌గైడ్స్, టాక్సీ డ్రైవర్, హొటల్ డోర్‌మ్యాన్ etc ఉద్యోగులు (tipped employees)కి మామూలు కనీసవేతనాలు వర్తించవు, వాటికి వేరే కనీసవేతన పరిమితులు (నాకు తెలిసి $2+ whereas మిగతా ఉద్యోగాలకి $6-7) ఉంటాయి, వారి ఆదాయాన్ని వచ్చే 15-20% టిప్పు తో కలిపి లెక్కవేస్తారు కాబట్టి. కాబట్టి తిప్పు ఇవ్వటం తప్పనిసరి, ఇవ్వకపోతే వాళ్ళ కడుపుమీద కొట్టినట్టే. 15-20% అన్నా, 15% అన్నది సర్వీసు అస్సలు నచ్చకపోతే ఇచ్చే కనీస టిప్పు, 20% అనేది స్టాండర్డు. కానీ యూరోపు లో అలా కాదు, సర్వీసు విపరీతంగా నచ్చేస్తే మీ అనందాన్ని ప్రకటించటానికి ఇవ్వాలనుకుంటే ఇవ్వటం, అంతే. మన భారతంలో టిప్పు ఎప్పుడు ఎలా వచ్చింది లాంటి పుట్టుపూర్వోత్త్రాలు తెలియవు కాని, US లాగ tips are usually expected, కాని Europeలాగా పదో పరకో ఇవ్వటం ఆనవాయి అనుకుంట. may be ఇలా టిప్పులు వస్తాయిలే అని జీతాలు కూడా తక్కువ ఇస్తారేమో.