నేను నా కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న కులం నాది. నా కులం ప్రపంచానికి ఎందరో మహనీయులని అందించింది. వారు నా కులం వారని తలుచుకున్నపుడు నా చాతీ
గర్వంతో ఉప్పొంగుతుంది. మిగతా కులాలు ఇంకా సరిగ్గా అభివృద్ధి కూడా చెందని రోజుల్లోనే, నా కులం నాగరికత నేర్చింది. ఇంకా చెప్పాలంటే, నా కులమే ఇతర కులాలకు నాగరికత నేర్పిందన్నా అబద్దం లేదు.
ఫలానా కనుగొన్న ఫలానా నా కులం వాడే...
నా కులం ఎప్పుడూ ఇతర కులాలతో సామరస్యంగానే ఉంది. ఇతర కులాల వాళ్ళు రాళ్ళు రువ్వినా,రెచ్చగొట్టినా సంయమనం కోల్పోలేదు.అదీ నా కులం గొప్పదనం.
నా కులం అభివృద్ధి కి నేను పాటు పడతాను. నా కులం వాడు,ఇంకో కులం వాడితో ఏదైనా విషయంలో పోటీ పడుతుంటే నా కులం వాడే నెగ్గాలని మనస్పూర్తిగా ఆశిస్తాను.నా కులానికి చెందిన స్నేహితుడు,ఇంకో కులానికి చెందిన స్నేహితుడూ నా సాయం కోరి, ఇద్దరిలో ఒక్కరికే సాయం చెయ్యగల పరిస్థితిలో ఉంటే నేను నా కులం వాడికే సాయం చేస్తాను.ఇది చెప్పటానికి నేనేమీ సిగ్గు పడటం లేదు.అది నా బాధ్యత అని భావిస్తాను. అన్ని కులాల వాళ్ళమూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నా కులం వాడు ఇంకోడు కనిపిస్తే నాకు ఆత్మీయుడిని చూసినట్టు ఉంటుంది తెలుసా!
నా కులం వాడు ఏదైనా రంగంలో గుర్తింపు సాధిస్తే నేనే ఆ విజయం సాధించినట్టు ఫీలవుతాను. నా కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళతో గొడవ పడితే నా కులం వాళ్ళే గెలవాలని కోరుకుంటాను.నా కులం బాగులోనే
నా బాగు ఉందని నమ్ముతాను.
ఈ మధ్య ఈ కులంలో పుట్టిన ప్రతీ ఒక్కరికీ ఈ కులాన్ని తిట్టుకుంటూ, ఈ కులం ఆచారాల్లో లోపాలు ఎత్తి చూపటం,ఆర్ధికంగా పై మెట్టు మీదున్న మిగతా కులాలని పొగడటం ఫ్యాషనైపోయింది.
అలాంటి వారిని చూస్తే నాకసహ్యం. నా కులం ఆర్ధికంగా ఆ కులాలంత అభివృధ్ది పధంలో లేకపోవచ్చు. కానీ ఇతర కులాలన్నీ ఈర్షపడే సాంస్కృతిక వారసత్వం నా కులానికే సొంతం. ఈ విషయంలో ఇంకే కులం
నా కులానికి సాటి రాదని ఘంటాపదం గా చెపుతున్నాను....
****************************************************************
చదవడానికే అదోలా ఉంది కదా! ఇది రాసిన వాడు ఎంత కులపిచ్చోడై ఉంటాడో అనిపిస్తోందా? గుడ్. ఇప్పుడు పై పేరాల్లో "కులం" అన్న పదం స్థానంలో "దేశం" అన్న పదం పెట్టి మళ్ళీ చదవండి.
మాకర్ధమైపోయింది లేవోయ్.. అని ఊరుకోకండి. ప్లీజ్. ముందు చదివి ఆ తర్వాత ఇక్కడికి రండి.
ఏదో పత్రికలో పడిన దేశ భక్తి వ్యాసంలా లేదూ... ఒక సగటు మనిషి ఆలోచనలు కావూ?
************************
నా కాలేజీలో కులాల గొడవ గురించి నేను టపా రాసినప్పుడు విహారి గారిచ్చిన కామెంటిది.
ఆ కామెంటు తో నాలో అంతర్మధనం మొదలయ్యింది.అక్కడే నా సందేహం వెలిబుచ్చినా నా బాధ ఇంకొంచెం వివరంగా చర్చించాలనిపించింది.
దేశం,కులం రెండూ చాలా similar. రెండూ మన పుట్టుకతోనే నిర్ణయమైపోతాయి.మన concious choice కాదు.(nationality మార్చుకోవచ్చనుకోండి. కానీ అది negligible.
more over, పౌరసత్వం మారినంత మాత్రాన దేశభక్తి పోతుందని నేను అనుకోను.) చిన్నప్పటి నుండి చూట్టూ ఉన్న వారి ప్రోద్బలం వల్ల మనలో కలిగే భావాలే రెండూ.
మరి ఒకటి తప్పెలా ఐంది, ఇంకోటి ఒప్పెలా ఐంది??
దేశ "భక్తి" ఎలా ఆయింది? కుల "పిచ్చి" ఎలా అయింది??
"మీదే దేశం?" అని అడగటం సభ్యతెలా అయింది?
"మీదే కులం?" అని అడగటం అసభ్యతెలా అయింది?
కులాభిమానంలో ఏమీ తప్పు లేదని నేను నా కులాన్ని embrace చేసుకోవాలా?? లేక అది తప్పైనప్పుడు దేశమంటూ అభిమానం చూపించటం కూడా తప్పని "జగమంత కుటుంబం నాది" అనుకోవాలా?
మీరే సలహా చెప్పండి!
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
Knowing you, I kind of knew where this is going :)
చూద్దాం మిగతావాళ్ళేమంటారో, I think another long-debate is on its way :)
జగమంత కుటుంబం నాది
నాకైతే కులపిచ్చీ, మితిమీరిన దేశభక్తీ రెంటిలోనూ సామీప్యత కొట్టొచ్చినట్లు కనబడుతుంది. దాదాపు ఇదే concept నేను "దేశభక్తి అంటే?!?"( అనే టపాలో చెప్పబూనితే..ఏటేటో అన్నారు, ఈ క్రింది లంకెలో చూడండి.
http://parnashaala.blogspot.com/2008/08/blog-post_19.html
"నావరకూ దేశభక్తి అంటే, "కేవలం మనం ఈ దేశంలో పుట్టామన్న ఒకేఒక్క కారణం చేత ఈ దేశాన్ని ప్రేమించడం". చాలా పచ్చిగా అనిపించినా అది కాదనలేని నిజం. By chance నేను పాకిస్తాన్ లో పుట్టుంటే, ఆ దేశాన్ని విజయవంతంగా ప్రేమిస్తూ, భారతదేశాన్ని ద్వేషించకపోతే అది unpatriotic అనుకుంటూ బ్రతికేసేవాడినే కదా!"
"దేశ" రాజ్యాంగంలోనే "కులం" గుర్తించబడింది. ప్రభుత్వ దరఖాస్తులు చాలా మటుకు నీదేకులం అని అడుగుతాయి. మీరు భారతీయులైతే మన రాజ్యాంగాన్ని గౌరవించండి.
నా అభిప్రాయమేమిటంటే,
కులానికి సంబంధించినది అయినా, "race"(జాతి)కి సంబంధించినది అయినా, పక్కవాడి జోలికి పోనంత వరకూ తప్పులేదు. నీ ఇంట్లో నువ్వు వ్రతం చేసుకున్నా, గాస్పెల్ పాడుకున్నా, "అల్లా హో అక్బర్" అని (దీన్నే azaa ఇవ్వడం అంటారు), ఒకళ్ళని ట్రబుల్ చేయతనంతవరకూ ఇష్యూ కాదు.
సమస్యల్లా పుట్టంగానే నేను బెటర్ అంటేనో, బయట బాంబులు పెడితేనో నేను ఎవ్వరికి ఓటెయ్యాలో నువ్వు డిసైడ్ చేస్తానంటేనో... అప్పుడు మొదలవుతుంది.
the broader u think bigger ur world is ... dont try to make it narrow
కులాభిమానం, దేశాభిమానం ఉండడంలో తప్పేం లేదు. దురభిమానం కానంత వరకూ అది పర్లేదేమో!
ఇప్పుడు చూడండి.., కులం గురించిన మీ గత జాబులో చేతన గారిది కాకినాడే అని తెలిసి సంతోషపడ్డారు. ఆమే, మీరూ కాకినాడ వాళ్ళైతే ఏంటి? ఎందుకు చాలా సంతోషం? మానవ సహజమది! మన వాళ్ళనుకోవడంలో ఉండే తృప్తి, మనవాళ్ళు కనబడితే ఉండే సంతోషం సహజం. ఈ మాత్రానికే మీరు కాకినాడవాళ్ళని మాత్రమే అభిమానించే సంకుచితులైపోతారా?
అలానే, మన దేశాన్ని ప్రేమించినంత మాత్రాన మనం సంకుచితులైపోము. తల్లిదండ్రులను ప్రేమించడమెలాగో మన ఐడెంటిటీకి చెందిన దాదాపుగా ప్రతీదాన్నీ - కులం, ఊరు, మన చుట్టాలు, దేశం, మతం - ప్రేమించడం సహజం. అమ్మని ప్రేమించినట్లుగా ముక్కూమొహం తెలీని ఏ ఆఫ్రికాలోనో ఉన్న ఒక తల్లిని ప్రేమించగలమా? మన అమ్మకే మనం పుట్టడం మాత్రం యాక్సిడెంటు కాదా? 'మరో తల్లికే మనం పుట్టి ఉంటే ఆమెనే ప్రేమించి ఉండేవాళ్ళం కదా' అని అమ్మను ప్రేమించకుండా ఉంటామా? మానవ సహజమైన వాటి పట్ల ఎందుకంత కలవరం?
ఇక, విశ్వజనీనత గురించి -మన వాళ్ళను ప్రేమించడమెలాగో, మనవాళ్ళని ద్వేషించేవాళ్ళని ద్వేషించడమూ అంతే సహజం. అమ్మనో, నాన్ననో అకారణంగా అవమానించినవాడు మనకు ఏమీకాడా? వాడిపై మనకు కోపం ఉండదా?
(సందీప్: నేనిక్కడ అమ్మా నాన్నల ఉదాహరణలను తీసుకోవడానికి కారణం, కేవలం ఉదాహరణల కోసమే. మరో ఉద్దేశం లేదు, మరే ఉద్దేశమూ లేదు.)
మతవరమాయే నా మదిలో నా మదిలో... దాన్నెందుకు వదిలేశారు? దేశం వంద కోట్లను కవర్ చేస్తుంది, కులం లక్షలు మాత్రమే - స్కోపు, హోపూ రెండు తక్కువ!
సలహా: మనుషులను కులాతీతంగా చూసి, ప్రవర్తించే విద్యను ఎంతెంత నేర్చుకుంటే అంతంత సమాజానికి లాభం చేసిన వాళ్ళం అవుతాం.
ముందుగా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి.
ఇక్కడ నా stance మరింత clear గా చెప్పవలిసిన అవసరం ఉందనిపిస్తోంది.
కేవలం నా ఏరియా కి చెందిన వాడు అన్న కారణంతో ఒకడు గెలవాలని నేను కోరుకోను. ఉదాహరణకి indian
idol లో కారుణ్య,సందీప్ ఆచార్య ఫైనల్ కి వెళ్ళినప్పుడు
ఫ్రెండొకడు మెసేజ్ పంపాడు,కారుణ్యకి ఓటేస్తూ మెసేజ్ పంపమని. నాకు అంత ఇంటరెస్టు లేదురా, అయినా
పంపవలసి వస్తే నేను సందీప్ ని సపోర్ట్ చేస్తూ పంపుతాను. నాకు వాడి వాయిస్ నచ్చింది అంటే
నాకు పిచ్చెక్కిందన్నట్టు చూసాడు.
అలాగే చివర్లో సందీప్ గెలిచినపుడు మొత్తం నార్త్ వాళ్ళంతా ఓట్లెయ్యడం వల్లే గెలిచాడని అంతా అనుకున్నాం.
అంతెందుకు, తాజ్ మహల్ కి ఓటేసావా అని ఫ్రెండడిగితే తాజ్ కి వరల్డ్ వండర్ అయ్యే సీన్ లేదని
నా అభిప్రాయం,దానికన్నా గొప్ప కట్టడాలు ప్రపంచంలో
చాలా ఉన్నాయి అంటే వాడు నన్ను దేశ ద్రోహి కింద
జమ కట్టాడు.
అంటే నాది చాలా వరకూ మహేశ్ గారి పాలసీ అన్నమాట. కానీ నా ఈ ప్రవర్తనకి ఓ లోపం ఉంది.
ఇండియా క్రికెట్ ఆడుతుంటే, let the best team wins అని ఉండిపోవాలి నా నమ్మకం ప్రకారం.
కానీ ఇండియా గెలవాలని ఎందుకనిపిస్తుంది నాకు?
ఇక్కడ మహేశ్ గారి బ్లాగు caption గుర్తొస్తోంది.
" i am a fish trapped in my own bowl. but my bowl is bigger and better. Thats all!"
P.s: నాగన్న గారూ,మీకు నా బాధ సరిగ్గా అర్ధమవలేదులా ఉంది, కులాలను నేనెక్కడా సపోర్ట్ చెయ్యలేదు. నా పాత పోస్టు కూడా చదవండి.
శరత్ గారూ,చెప్పడం వీజీయే కానీ,పైన చెప్పినట్టు
instincts సహకరించవండీ!
మహేశ్ గారూ, నేనేటంటాను, మీరేమంటే నానూ అదే అంటాను...;-)
రానారె గారూ, ప్రభుత్వం అడిగేది general or others అనే కానీ కులాన్ని specify చెయ్యమని
కాదు కదండీ.
sravan, i agree with you.
అనానిమాసురుడా,(ఈ పదం coin చేసిందెవరో గానీ నా జోహార్లు!)
i am not trying to narrow my world. Just wondering aloud If there is any flaw in my point of view!
చదువరి గారూ,
ఇప్పటి దాకా, కులాభిమానం ఉండే వాళ్లని చూసి,
అసలలా ఎలా ఆలోచించగలుగుతున్నారా అని అనిపించేది. ఈ ఆలోచనలతో నాకు వాళ్ల angle అర్ధమయ్యింది. now, i can see from their side.
All i am saying is, May be కులాలని
ప్రేమించే వాళ్ళ గిరి కన్నా నా గిరి పెద్దది అంతే,కానీ
నాకూ ఓ గిరి ఉంది. అందుకే వారి మీద holier than thou... attitude తప్పేమో!
నా అసందర్భ ప్రలాపం: మనోడని కాదు కానీ, కారుణ్యనే గెలిచుండాల్సిందని నా అభిప్రాయం. నాదే కాదు, సోనూ నిగమ్‌ది కూడా. ఆ పోటీలో ప్రాంతీయ తత్వం ఎక్కువ ఓట్లు తెచ్చిపెట్టటం నిజమే.
ఎంత ఆలోచించినా నా చిన్న బుర్రకు లాజిక్ అర్దం కావటం లేదు. నాకు కులం మతం ప్రాంతం అభిమానం లేవు అని చెప్పే వాడిని నేను నమ్మను. నాకు నేను పుట్టిన ఊరంటే ప్రాణం. కులం అంటే కూడా అభిమానమే. మతం అంటే మరీ అంత లేదు.
దురదృష్టవశాత్తు అభిమానంకు కొలామానంగా వేరే కుల మత ప్రాంతాలపై చూపించే దురాభిమానాన్ని చూస్తూన్నారు. ఈ దురాభిమానుల వలన తమ ప్రాంతం కులం మతం లను అభిమానించే వాళ్ళు గర్వంగా చెప్పుకోలేక పొత్తున్నారు.
ప్రస్థుత ప్రపంచంలో కులం మతం ప్రాంతం అభిమానాలను డామినేట్ చెయ్యగల శక్తి ఒక డబ్బుకు మాత్రమే ఉంది.
’జగమంత ఒక కుటుంబం’ మాట ఎలా ఉన్నా ’డబ్బుకు లోక దాసోహం’ అన్న మాట ఇప్పటి ప్రపంచానికి బాగా సూట్ అవుతాది.
Post a Comment